Saturday, April 27, 2024
- Advertisement -

నరేంద్ర మోదీ ని చంపడానికి ప్లాన్.. పోలీసులకి ఊరట..!

- Advertisement -

2004 నాటి ఇష్రత్​ జహాన్​ ఎన్​కౌంటర్​ కేసులో అరెస్టు అయిన ముగ్గురు పోలీసు అధికారులు జీఎల్​ సింఘాల్​, తరుణ్​ బరోత్​, అనజు చౌదరికి ఊరట లభించింది. ఈ కేసు నుంచి వారికి విముక్తి కల్పిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కేసులో ప్రాసిక్యూషన్ ఎదుర్కొంటున్న చివరి నిందితులు అయిన ముగ్గురు పోలీసులు.. అవసరమైన అనుమతి మంజూరు కావడంతో విచారణను విరమించుకోవాలని కోరుతూ మార్చి 20 న కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు. 

గుజరాత్​ అప్పటి ముఖ్యమంత్రి నరేంద్రమోదీని హత్యచేయడానికి ఇష్రత్​ జహాన్​తో పాటు జావేద్​ షేక్​ అలియాస్​ ప్రణేశ్​ పిల్లై, అంజద్​ అలీ అక్బరలీ రానా, జోషన్​ జోహార్ అనే ఉగ్రవాదులు కుట్రపన్నారని ఆరోపిస్తూ వారిని 2004 జూన్​లో పోలీసులు అహ్మదాబాద్​లో ఎన్​కౌంటర్ చేశారు.

ఇది బూటకపు ఎన్​కౌంటర్​ అని ఆరోపణలు రాగా… ఈ వ్యవహారం మొత్తం తీవ్ర వివాదాస్ప దమైంది.తాజాగా తమను విడుదల చేయాలంటూ ముగ్గురు పోలీసు అధికారులు (వీరిలో బరోత్​ రిటైర్​ అయ్యారు) డిశ్ఛార్జి పిటిషన్​ వేయగా సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి వీఆర్​ రావల్​ అనుమతించారు.

టోర్నీ వాయిదా.. క్రీడా అభిమానులకి చేదు వార్త..!

ధోనీ సేన పై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..!

మరో ముగ్గురు బలి… మాస్క్ పని ఎక్కడ బాబు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -