ధోనీ సేన పై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు..!

- Advertisement -

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రస్తుత సీజన్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు కొన్ని ఇబ్బందులు ఉన్నాయని టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా అన్నారు. ఆ జట్టు టాప్‌-7లో నలుగురికి సరైన సన్నద్ధత లేదని పేర్కొన్నారు. ఇది ఆ జట్టు ప్రధాన లోపం అన్నారు. కీలకమైన సురేశ్‌ రైనా విఫలమైతే వారి విజయావకాశాలు మరింత దెబ్బతింటాయని చెప్పారు. మరో 9 రోజుల్లో సరికొత్త సీజన్‌ ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో చెన్నై తొలి మ్యాచులో తలపడనుంది.

సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోనీ వంటి క్రికెటర్లు అంతర్జాతీయ లేదా పోటీ క్రికెట్‌ ఆడటం లేదు. గాయం కారణంగా కొన్నాళ్లుగా రవీంద్ర జడేజా టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. అంటే ఏడుగురు అత్యుత్తమ ఆటగాళ్లలో నలుగురు ఫామ్‌లో లేరు లేదా పోటీ క్రికెట్‌ ఆడలేదు’ అని ఆకాశ్‌ గుర్తు చేశారు.

- Advertisement -

రాబిన్‌ ఉతప్ప, రుతురాజ్‌ గైక్వాడ్‌ రాణించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వారు దేశవాళీ క్రికెట్‌ ఆడారు. మంచి గణాంకాలు సాధించారు. డుప్లెసిస్‌ కూడా ఫామ్‌లోనే ఉన్నాడు. కానీ మిగిలిన నలుగురి సంగతేంటి? భారీ షాట్లు ఆడటం, పరుగెత్తడం వారికి సవాల్‌గా మారతాయి’ అని ఆకాశ్‌ పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి షాకుల మీద షాకులు!

‘వకీల్‌ సాబ్’కి షాక్ ఇచ్చిన పోలీసులు!

మరో ముగ్గురు బలి… మాస్క్ పని ఎక్కడ బాబు..!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -