కరోనాతో సినీ నటి కవిత కొడుకు కన్నుమూత

- Advertisement -

గత ఏడాది నుంచి కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీలో ఎన్నో విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగు ఇండస్ట్రీలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. టాలీవుడ్ సీనియర్ నటి కవిత ఇంట్లో కరోనా మహమ్మారి విషాదం నింపింది. ఆమె తనయుడు సంజయ్ రూప్ కొవిడ్‌తో మృతి చెందాడు. ఇటీవల సంజయ్ కోవిడ్ భారిన పడ్డారట దాంతో హోం క్వారంటైన్‌లో ఉన్నాడు.

ఈ నేపథ్యంలో సంజయ్ ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచాడు. మరోవైపు కవిత భర్త దశరథరాజు కూడా కరోనా బారినపడి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇక బాలనటిగా సినీ కరెరీర్ ప్రారంభించిన కవిత పలు చిత్రాల్లో హీరోయిన్ గా కూడా నటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించింది. సంజయ్ రూప్ మృతికి పలు సినీ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలిపారు.

కేసీఆర్​ ఫామ్​హౌస్​ ఎక్కడో కూడా తెలియదు..!

నా శ్రీదేవి అంటూ హరీష్ శంకర్ షాకింగ్ ట్విట్..?

‘ఆహా’లోకి హరీశ్ శంకర్..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -