కిడ్నాప్ అనుకున్నారు.. కానీ జరిగింది వేరే..!

- Advertisement -

నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పచ్చల నడకుడలో స్థానికులు ఓ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. కిడ్నాపర్​ అనుకుని చితకబాదారు. గ్రామానికి చెందిన ఓ నాలుగేళ్ల చిన్నారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడని భావించిన గ్రామస్థులు.. హైమద్​ అనే ద్విచక్ర వాహనదారుడిపై దాడికి దిగారు.

తాను ఎత్తుకెళ్లడం లేదని బాధితుడు ఎంత చెప్పినా వినకుండా చితకబాదారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. హైమద్​ను వేల్పూర్ పోలీస్​స్టేషన్​కు తరలించారు.

- Advertisement -


అనంతరం గ్రామంలోని సీసీ ఫుటేజీలను పరిశీలించగా.. బాలిక ద్విచక్రవాహనానికి అడ్డువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాలికను హైమద్​ పైకి లేపుతుండగా కిడ్నాప్ చేస్తున్నాడనుకున్న స్థానికులు అతనిపై దాడి చేసినట్లు వివరించారు.

6000 మీటర్ల లోతు తవ్వే స్వదేశీ డ్రిల్లింగ్ రిగ్గును తయారు చేసిన మేఘా

డబ్బుకు కక్కుర్తి పడ్డాడు.. అంతలోనే కాల్చాడు!

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -