Sunday, April 28, 2024
- Advertisement -

పవనే టార్గెట్..జగన్ మార్క్ వ్యూహం!

- Advertisement -

ఆపరేషన్ పిఠాపురం..ఇప్పుడు సీఎం జగన్ ముందున్న టార్గెట్ ఇదే. పిఠాపురంలో పవన్‌ని ఓడించడమే లక్ష్యంగా ఇంఛార్జీలను నియమించారు జగన్. ఇక పిఠాపురం రాష్ట్రంలోనే కాపు సామాజివర్గ ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం. అందుకే కాపు సామాజికవర్గానికి చెందిన వంగా గీతాను అభ్యర్థిగా ప్రకటించిన జగన్, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను పార్టీలో చేర్చుకున్నారు. అలాగే 2019లో జనసేన నుండి పోటీ చేసిన శేషుకుమారి సైతం వైసీపీలో చేరారు.

ఇలా పవన్ పోటీ చేస్తున్న నియోజకవర్గాన్ని టార్గెట్ చేస్తూ కీలక నేతలు అందరికీ సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. పిఠాపురం ఇంఛార్జీగా మిథున్ రెడ్డి వ్యవహరించనుండగా మండలాల వారీగా కీలక నేతలు వ్యవహరించనున్నారు.

గొల్లప్రోలు మండల ఇంఛార్జీగా మాజీ మంత్రి కన్నబాబు,యు కొత్తపల్లికి దాడిశెట్టి రాజా అలాగే ముద్రగడ పద్మనాభంతో పాటు ద్వారంపూడి చంద్రశేఖర్ కి కీలక బాధ్యతలు అప్పగించారు జగన్. ఆపరేషన్ పిఠాపురంలో భాగంగా వంగ గీతతో కీలక సమావేశం నిర్వహించారు ముద్రగడ. ఎన్నికల ప్రచారం, ఎన్నికల వ్యూహం ఏ విధంగా ఉండాలి అనే దానిపై చర్చించారు. అలాగే ప్రధానంగా టీడీపీ, జనసేన నుండి బలమైన నేతలను చేర్చుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తంగా పవన్‌ని ఓడించడం ద్వారా ఆయన రాజకీయ భవిష్యత్ ప్రశార్ధకం చేయాలని జగన్ పక్కా వ్యూహంతో ముందుకు వస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -