Thursday, May 2, 2024
- Advertisement -

కుప్పంలో టీడీపీకి టఫ్ ఫైటేనా?

- Advertisement -

కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఈసారి కష్టమేనా?ఎనమిదోసారి కుప్పం బరిలో నిలుచున్న చంద్రబాబు గట్టి పోటీ ఎదుర్కొంటున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 1989 నుండి కుప్పంలో గెలుస్తు వస్తున్నారు చంద్రబాబు. అయితే తన రాజకీయ జీవితంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి గెలుపు కోసం చమటోడుస్తున్నారు బాబు.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు ఉన్న కుప్పం నుండి గెలిచిన చంద్రబాబు మూడు సార్లు సీఎం అయ్యారు. కుప్పం, గుడిపల్లె,రామకుప్పం,వెంకటగిరి కోట
శాంతిపురం మండలాలుండగా వైసీపీ నుండి భరత్ పోటీ చేస్తున్నారు. భరత్‌ని గెలిపిస్తే మంత్రి చేస్తాని సీఎం జగన్ హామీ ఇవ్వడంతో వైసీపీ శ్రేణులు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

కుప్పం నియోజకవర్గం 1955లో ఏర్పడగా ఆ ఎన్నికలలో డి.రామబ్రహ్మం ,1962లో సి.పి.ఐకు చెందిన వజ్రవేలు శెట్టి గెలుపొందారు. 1967, 1972లలో వరసగా రెండు సార్లు ఇండిపెండెంట్ అభ్యర్థి డి.వెంకటేశం గెలిచాడు. 1978లో కాంగ్రెస్ ,1983, 85లలో రంగస్వామి నాయుడు గెలువగా, 1989 నుండి నారా చంద్రబాబు విజయం సాధిస్తూ వస్తున్నారు.

కుప్పం నుండి 2014,2019లో మాజీ ఐఏఎస్ చంద్రమౌళి పోటీ చేసి 55 వేలు,70 వేల ఓట్లు సాధించారు. చంద్రమౌళి కుమారుడే భరత్. తనని గెలిపిస్తే కుప్పంను మరింత అభివృద్ధి చేస్తానని, సంక్షేమాన్ని అందిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఇక చంద్రబాబు సీఎంగా ఉన్న కుప్పంకు ఏం చేయలేకపోయారనే మెస్సేజ్‌ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఇక ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఘోర ఓటమి తప్పలేదు. దీంతో ఎనమిదోసారి కుప్పం నుండి పోటీ చేస్తున్న చంద్రబాబుకు బలమైన ప్రత్యర్థిగా మారారు భరత్. గత ఎన్నికల్లో చంద్రబాబు మెజార్టీ తగ్గడం,ఆయనపై వ్యతిరేకత, జగన్ పాలన పట్ల సానుకూలతను ప్రధాన ప్రచారస్త్రంతో ముందుకు సాగుతున్నారు భరత్. మరి కుప్పం ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాల్సిందే.

ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచిచూడాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -