- Advertisement -

ఐదేళ్లు నేనే సీఎం..క్లారిటీ ఇచ్చిన సిద్దూ!

- Advertisement -

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం తన సీఎం పదవిపై స్పష్టత ఇచ్చారు. తనకు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు మధ్య రెండున్నరేళ్ల అధికార భాగస్వామ్య ఒప్పందం ఏదీ లేదని ఆయన ఖండించారు. పార్టీ అధిష్టానం వేరే నిర్ణయం తీసుకునే వరకు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. బెలగావిలో జరిగిన కర్ణాటక శాసనసభ సమావేశాల చివరి రోజున ప్రతిపక్ష నేతల ప్రశ్నలకు సమాధానంగా సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

ముందుగా ప్రజలు ఆశీర్వదించాలి. ఆ తర్వాత శాసనసభా పార్టీ సమావేశంలో ఎమ్మెల్యేలు నాయకుడిని ఎన్నుకుంటారు. అనంతరం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఇదే నేను ఎప్పటినుంచో చెబుతున్నది. ఇప్పటికీ నేను ముఖ్యమంత్రినే, అధిష్టానం వేరే నిర్ణయం తీసుకునే వరకు ముఖ్యమంత్రిగానే ఉంటాను అని సిద్ధరామయ్య అన్నారు.

అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఆర్. అశోక్ రెండున్నరేళ్ల ఒప్పందంపై ప్రశ్నించగా నేను ఎప్పుడూ రెండున్నరేళ్ల గురించి చెప్పలేదు. అలాంటి ఒప్పందమే లేదు అని ఆయన తేల్చిచెప్పారు.

ఇటీవలి నెలలుగా సిద్ధరామయ్య–శివకుమార్ మధ్య నాయకత్వంపై పోరు కొనసాగుతోంది. ప్రభుత్వం అర్ధకాలాన్ని పూర్తిచేసిన నేపథ్యంలో కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి నాయకత్వ మార్పు కోరిన విషయం తెలిసిందే. అయితే పార్టీ అధిష్టానం ఇద్దరూ పరస్పరం చర్చించుకోవాలని సూచించింది.
ఈ నేపథ్యంలో వివాదాన్ని తగ్గించేందుకు సిద్ధరామయ్య, శివకుమార్ రెండు సార్లు బ్రేక్‌ఫాస్ట్ సమావేశాలు నిర్వహించారు. అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని గౌరవిస్తామని ఇద్దరూ తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -