తెలంగాణ ఎన్నికల వేళ కాంగ్రెస్కు గట్టి షాక్ తగిలింది. రేవంత్ ఒంటెద్దు పోకడలతో కాంగ్రెస్తో 48 ఏళ్ళ బంధాన్ని తెంచుకున్నారు పొన్నాల. ఇవాళ పొన్నాలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. దీంతో పొన్నాల బీఆర్ఎస్లో చేరడం ఖాయమై పోయింది. ఇక రేపు సీఎం కేసీఆర్తో భేటీ కానున్నారు పొన్నాల. అనంతరం గులాబీ కండువా కప్పుకోనున్నారు.
పొన్నాలతో భేటీ సందర్భంగా పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం బీఆర్ఎస్లో చేరికకు పొన్నాల సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక బీఆర్ఎస్ జనగామ టికెట్ పొన్నాలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. పొన్నాల అనుచరులు పెద్ద ఎత్తున ఆయన ఇంటికి చేరుకుని ఇదే నినాదం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
అక్టోబర్ 16న జనగాంలో జరగబోయే సభలో పొన్నాల బీఆర్ఎస్ లో చేరనున్నారని సమాచారం. ఇక పొన్నాల బీఆర్ఎస్లో కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. పొన్నాల చేరికతో కాంగ్రెస్కు పెద్ద దెబ్బ పడింది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోక పోయినా ఆ పార్టీకి షాకేనని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
