- Advertisement -

పాలిటిక్స్‌లో నో పుల్‌స్టాప్‌!

- Advertisement -

రాజ్యసభ నుంచి పదవీ విరమణ చేస్తున్న సభ్యులను ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాజకీయాల్లో ఫుల్ స్టాప్ అనే దాంట్లో ఉండదు అని ఆయన పేర్కొన్నారు. ప్రజాసేవ అనేది పదవీకాలంతో ముగియదని, అది నిరంతర ప్రయాణమని స్పష్టం చేశారు.

బుధవారం జరిగిన వీడ్కోలు సమావేశంలో మాట్లాడిన ప్రధాని, రాజ్యసభ సభ్యుల సేవలను కొనియాడారు. పార్లమెంటరీ సంప్రదాయాలను, ప్రజాస్వామ్య విలువలను బలపరిచే విషయంలో వారి పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు. అనుభవం, జ్ఞానం ఎప్పటికీ విలువైనవేనని ఆయన పేర్కొన్నారు.

యువ ఎంపీలు సీనియర్ నాయకుల నుంచి నేర్చుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే, శరద్ పవార్, దేవే గౌడ వంటి ప్రముఖ నాయకుల సేవలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నాయకులు తమ జీవితంలో పెద్ద భాగాన్ని పార్లమెంట్ సేవకు అంకితం చేశారని, వారి నిబద్ధత యువతకు ప్రేరణగా నిలుస్తుందని చెప్పారు.

ఈ సందర్భంగా రామ్‌దాస్ అథవాలేను “ఎవర్‌గ్రీన్”గా అభివర్ణిస్తూ, ఆయన సభలో తీసుకువచ్చే హాస్యాన్ని గుర్తుచేశారు. మొత్తంగా, ప్రజాసేవకు ముగింపు లేదని, అనుభవజ్ఞుల మార్గదర్శకత్వం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని ప్రధాని సందేశం ఇచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -