Thursday, May 2, 2024
- Advertisement -

తణుకు…ఈసారి కారుమూరిదే!

- Advertisement -

ఏపీ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో వైసీపీ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. రెండోసారి వైసీపీకే అధికారం ఖాయమని అన్ని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. ఇక నియోజకవర్గాల వారీగా గెలుపు వ్యూహాలను రచిస్తు వైసీపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఈసారి వైసీపీ జెండానే ఎగరనుంది. మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావుతో టీడీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తలపడనున్నారు. నియోజకవర్గంలో 2, 33 , 082 మంది ఓటర్లు ఉండగా వీరిలో మహిళా ఓటర్లే ఎక్కువ. అందుకే ఇక్కడ గెలిచేది ఎవరన్నది డిసైడ్ చేసేది మహిళలే.

‌1983 నుంచి ఇప్పటివరకు ఆరుసార్లు టీడీపీ, రెండుసార్లు కాంగ్రెస్‌,ఒకసారి వైసీపీ విజయం సాధించింది. కాంగ్రెస్ నుండి ఓసారి,వైసీపీ నుండి ఓసారి గెలిచారు కారుమూరి. రెండోసారి గెలిచిన కారుమూరిని మంత్రిని చేశారు జగన్. తణుకులో తన మార్క్‌ని స్పష్టంగా చూపించారు. టికెట్‌ ప్రకటన తర్వాతి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు కారుమూరి. జగన్ సంక్షేమ పథకాలు, తాను చేసిన అభివృద్ధే గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ప్రచారంలో కారుమూరి దూసుకుపోతుండగా టీడీపీ అభ్యర్థికి జనసేన నుండి మద్దతు కరువైంది. ఎందుకంటే ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు జనసేన నేత విడివాడ రామచంద్రరావు సిద్ధం కాగా ఈ సీటును టీడీపీకి కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. అంతేగాదు జనసైనికులు టీడీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. దీంతో ఈసారి కూడా తణుకులో వైసీపీ జెండగా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -