Saturday, April 27, 2024
- Advertisement -

యువ ఓటర్ల చూపు వైసీపీ వైపే!

- Advertisement -

ఏపీలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కాగా నాలుగో దశలో అంటే మే 13న ఏపీలో ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక సీఎం జగన్ ఈ నెల 27 నుండి బస్సుయాత్ర ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. 21 రోజుల పాటు జగన్ బస్సు యాత్ర ఉండనుంది.

ఇక అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన ఎజెండగా జగన్ ప్రచారం ఉండనుంది. ఇక ఈ సారి ఎన్నికల్లో యువ ఓటర్లే కీలకం కానున్నాయి. దీంతో పాటు వృద్ధులు, వికలాంగులు ప్రధాన పాత్ర పోషించనున్నారు. దాదాపు 15 లక్షల మందికి పైగా యువత తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఏప్రిల్‌ 15 వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

యువత ఓట్లు పెద్ద సంఖ్యలో ఉండటంతో ఈ ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధి అంశాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇక వైసీపీ గత ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోను 99 శాతం అమలు చేసింది. ఇక యువత జగన్ నాయకత్వంపై నమ్మకంతో ఉన్నారు. అలాగే ఈసారి మేనిఫెస్టోలో యువతను ఆకర్షించే విధంగా పథకాలు ఉండనున్నాయని తెలుస్తోంది. దీంతో యువ ఓటర్లు అంతా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.అలాగే వృద్ధులు, వికాలంగులకు పెన్షన్, పథకాలు టైంకి అందిస్తుండటంతో వీరు కూడా జగన్‌ పార్టీకి ఓటు వేసే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -