- Advertisement -

వక్ఫ్‌ ఆస్తులపై కూటమి సర్కార్ కన్ను!

- Advertisement -

విజయవాడ వక్ఫ్ బోర్డు రాష్ట్ర కార్యాలయం వద్ద వైయస్ఆర్ సీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా గుంటూరు నగర వైయస్ఆర్ సీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా మాట్లాడుతూ..
కూటమి పాలనలో మైనార్టీలు బలవుతున్నారు, గుంటూరు పట్టణంలో వక్ఫ్ ఆస్తులను కాజేయాలని చూస్తోంది, వక్ఫ్ ఆస్తుల జోలికి వస్తే ఊరుకునేది లేదు

ఎమ్మెల్సీ రుహుల్లా మాట్లాడుతూ..మైనార్టీల స్థలాలను కూటమి ప్రభుత్వం దోచుకుంటోంది, మైనార్టీల మీద ప్రేమ ఉంటే వారికి ఉపయోగపడే పనులు చేయండి, 2029లో వచ్చేది జగన్ మోహన్ రెడ్డే, వక్ఫ్ ఆస్తులు పీపీపీ మోడ్ లో తీసుకున్న వారి దగ్గర నుండి వెనక్కి తీసుకుంటాం, మైనార్టీల భూములను తీసుకుంటే అల్లా క్షమించరు

మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ..ముస్లిం, మైనార్టీల ఆస్తులను , హక్కులను కాపాడతామని చంద్రబాబు చెప్పాడు, ఎన్నికల్లో దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు, నూతన వక్ఫ్ బోర్డు చట్టాన్ని అడ్డుకోకుండా లోక్ సభలో మద్దతిచ్చారు, సీఆర్డీఏ పరిధిలో ల్యాండ్ పూలింగ్ కోసం 50 వేలు ఎకరాలు తీసుకున్నారు, 300 ఎకరాలు ఏపీఐఐసీకి దొరకలేదా? మా ముస్లింల భూములే కనిపించాయా? వక్ఫ్ బోర్డు , ముస్లిం సమాజం అనుమతి లేకుండా భూములు లాక్కుంటున్నారు, ప్రభుత్వం తన ఆలోచనను విరమించుకోక పోతే న్యాయస్థానాల్లో పోరాడుతాం అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -