రామ్ చరణ్ హీరోగా గోవిందుడు అందరివాడేలే సినిమాకి దర్శకత్వం వహించడు కృష్ణవంశీ. ఈ సినిమా ప్లాప్ కావడంతో చాలా రోజులు గ్యాప్ తోసుకున్న కృష్ణవంశీ. ఇప్పుడు ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాని ప్రకాష్ రాజ్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమాకి రుద్రాక్ష అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. మొదట్లో ఈ సినిమాలో అనుష్కను తీసుకున్నారు. ఈ సినిమాని స్టార్ట్ చేద్దాం అంటే బాహుబలి, సైజ్ జీరో లాంటి సినిమాలతో అనుష్క ఫుల్ బిజీగా ఉండటంతో ఆమె కోసమే వెయిట్ చేశారు. ఐతే ఈ చిత్రం లేడీ ఓరియంటెడ్ తరహాలో తెరకెక్కుతుంది.
అప్పట్లో అనుష్క కూడా ఈ సినిమా చేయడానికి ఓప్పుకుంది. కానీ ప్రస్తుతం అనుష్క బాహుబలి2 షూటింగ్‍లో బిజీగా ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేక ఈ సినిమానుంచి తప్పుకుంది. సడన్‍గా ఈ నిర్ణయం తీసుకునే సరికి కృష్ణవంశీకి ఏం చేయాలో అర్ధం కాలేదు. వేరే హీరోయిన్ కోసం చూస్తున్న సమయంలో తాజాగా సమంతను తీసుకున్నారు అని సమాచారం. త్వరలోనే అధికారికంగా వివరాలు తెలపనున్నారు.
