- Advertisement -

మ‌హేష్‌ని లైన్‌లో పెట్టిన వినాయ‌క్

- Advertisement -

వ‌రుస సినిమాలు చేస్తు మ‌హేష్ ఫుల్ బిజి అయిపోతున్నాడు.ఎప్పుడు లేని అంతాగా వరుస సినిమాలు చేస్తు అభిమానుల‌కు షాక్ మీద షాక్ ఇస్తున్నాడు.సాధార‌ణంగా ఒక సినిమా పూర్తి చేసిన త‌రువాత ఇంకో సినిమా మొద‌లు పెట్టే ప్రిన్స్ ఇటీవ‌ల కాలంలో స్పీడ్‌గా సినిమాలు చేస్తున్నాడు.ప్ర‌స్తుతం కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో ”భర‌త్ అనే నేను” అనే సినిమా చేస్తున్నాడు.త‌న 25వ సినిమాను కుడా లైన్లో పెట్టాడు మ‌హేష్.వంశీపైడిప‌ల్లికి ఈ సినిమా ద‌ర్శ‌క‌త్వ భాద్య‌త‌లు అప్ప‌గించ‌డం జ‌రిగింది.స్పైడ‌ర్ రిజల్ట్‌తో డీలా ప‌డ్డ మ‌హేష్ క‌థ‌ల ఏంపిక‌లో జాగ్ర‌త్త వ‌హిస్తున్నాడు.ఈ రెండు సినిమాల త‌రువాత మ‌హేష్ ద‌ర్శ‌కుల లిస్ట్ చాలా పెద్ద‌గా ఉంది.

బోయపాటి శ్రీనుతో ఓ సినిమా అని ..లేదు..లేదు ముందు త్రివిక్ర‌మ్ అని .. ఆ మధ్య రాజ‌మౌళి కుడా మ‌హేష్‌తో ఓ సినిమా క‌మిట్ అయ్య‌న‌ని ప‌త్రిక స‌ముఖంగా ప్ర‌క‌టించారు.ఇప్ప‌డు అదే లిస్ట్‌లోకి ఇప్ప‌డు మాస్ డైర‌క్ట‌ర్ వివి వినాయ‌క్ పేరు తెర‌పైకి వ‌చ్చింది.ఇప్పుడు సాయి ధరం తేజ్ తో సినిమా చేస్తున్న మాస్ దర్శకుడు వివి వినాయక్ తో.. మహేష్ ఓ చిత్రానికి యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తోంది.మహేష్ నుంచి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ వచ్చేయగా.. ఓ బడా నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇప్పటికే వినాయక్ కు అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని.. మహేష్ తో మూవీ ఖాయంగానే ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. కానీ ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ కు ఉన్న కమిట్ మెంట్స్ ప్రకారం అయితే.. మహేష్-వినాయక్ కాంబినేషన్ సెట్స్ కు వెళ్లేసరికే 2019 వచ్చేయడం ఖాయం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -