Tuesday, May 7, 2024
- Advertisement -

‘ప్రామిస్ చేసి మాట తప్పితే మనిషే కాదా?’…. మరి బాబు ఏంటి మహేష్?

- Advertisement -

‘ఒక సారి ప్రామిస్ చేసి మాట తప్పితే మనిషే కాదు’……..భరత్ అను నేను సినిమా కోసం మహేష్ చెప్పిన ఈ డైలాగ్ ఇప్పుడు సంచలనం అవుతోంది. ‘బిజెపితో పొత్తు పెట్టుకుని చారిత్రక తప్పు చేశా…….మళ్ళీ జన్మలో కలవను’ అని 2009 ఎన్నికల సమయంలో…..ఆ తర్వాత కూడా మైనారిటీలకు చాలా సార్లు ప్రామిస్ చేశాడు చంద్రబాబు. 2014లో ఏం చేశాడో అందరికీ తెలుసు. ఇక రైతు రుణాల మాఫీపైనే మొదటి సంతకం అని 2014ఎన్నికల సమయంలో ఊరూవాడా అదిరిపోయేలా ఊదరగొట్టాడు. కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే ‘రైతు రుణాల మాఫీ కమిటీ’పై సంతకం అన్నాడు. రుణమాఫీ హామీలు ఒక్కటి కూడా ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా నెవరేర్చింది లేదు. నిరుద్యోగ భృతి గురించి ఈ రోజుకీ అతీగతీ లేదు. పదిహేనేళ్ళు ప్రత్యేక హోదా అన్నాడు. అధికారంలోకి వచ్చాక తన స్వార్థం కోసం ప్యాకేజ్ నిధులు కావాలన్నాడు. 2019ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉండడంతో ఇప్పుడు మళ్ళీ హోదా పాట పాడుతున్నాడు.

ఒకటా రెండా…….చంద్రబాబు మాట తప్పిన విషయాల గురించి ఎన్నైనా చెప్పొచ్చు. ఓటుకు కోట్లు వ్యవహారాలను, అవినీతిలో నంబర్ ఒన్ వ్యవహారాలను పక్కనపెడితే కంటికి కనిపించేవే చాలా ఉన్నాయి. ఇప్పుడు సడన్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు సూపర్ స్టైల్‌లో ఎంట్రీ ఇచ్చి ‘ఒక్కసారి ప్రామిస్ చేసి….మాట తప్పితే మనిషే కాదు’ అని అంటే ఎలా? మా ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబుగారు ఏమైపోవాలి? అలాగే బాబుగారి భజనసేనుడు పవన్ కళ్యాణ్ పరిస్థితేంటి? 2014ఎన్నికల్లో బాబు, మోడీలకు ఓట్లేసి గెలిపించండి……వాళ్ళు అన్యాయం చేస్తే నేను ప్రశ్నిస్తా……ప్రజల తరపున పోరాడతా అంటూ భారీ హామీలు దంచి…….ఎన్నికలయిన తర్వాత నుంచీ రెండున్నరేళ్ళు ఫాం హౌస్ రాచకీయాలు, సినిమా వ్యవహారాలు వెలగబెట్టాడు. ఆ తర్వాత నుంచి రెండు మూడు రోజులు షో చేసి ఇప్పుడు అధ్యయనం అంటూ స్టార్ హోటల్స్‌లో ఎసి గదుల్లో టైం పాస్ చేస్తున్నాడు. పనిలో పనిగా అధికారంలో ఉన్న చంద్రబాబు, కెసీఆర్‌లను గొప్పగా పొగుడుతూ తెరవెనుక, తెర ముందు కూడా తన స్వార్థ ప్రయోజనాలు బాగానే పొందుతున్నాడు. 2014ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రజలకు ఇచ్చిన మాట ఏంటి? ఇప్పుడు చేస్తున్నది ఏంటి?

ఇలాంటి మోసపూరిత వ్యవహారాలన్నింటినీ హీరోయిజంగా చూపించాలని పచ్చ మీడియాతో పాటు బాబు బ్యాచ్ అంతా అహోరాత్రులు కష్టపడుతూ ఉంటే సడన్‌గా నువ్వొచ్చి…….మాట తప్పితే మనిషే కాదు ….అంటే ఎలా? ఆ డైలాగ్ విన్నప్పటి నుంచీ బాబు, పవన్‌ల మనోభావాలు, వాళ్ళ అభిమానుల మనోభావాలు దెబ్బతినవా? అసలు వాళ్ళే మనుషులు కాదని నువ్వంటే….తమ స్వార్థం కోసం వాళ్ళతో పనిచేసేవాళ్ళు…..వాళ్ళను అభిమానించేవాళ్ళు ఇంకేమవుతారు? ప్లీజ్ మహేష్……‘ప్రామిస్ చేసి మాట తప్పితే మనిషే కాదు’ అన్న డైలాగ్ ఒక్కటి మార్చు. లేకపోతే బోలెడంత మందికి నిద్దర్లు కరువవుతాయి. ప్లీజ్ కొరటాల శివగారు………మీ సామాజిక స్పృహను మేం ప్రతి సినిమాలో చూశాం. గొప్ప ఆలోచనలు ఉన్నాయి మీకు. కానీ ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలను అబద్ధాలతో నిలువునా ముంచుతున్న వాళ్ళను ఈ స్థాయిలో నిలదీస్తానంటే ఎలా? డైలాగ్ మార్చేయండి శివగారు. ఎన్ని మోసాలు చేసినా మూఢంగా అభిమానించే వాళ్ళ మనోభావాలు గౌరవించండి శివగారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -