Thursday, April 25, 2024
- Advertisement -

గాంధీ హాస్పిటల్‌లో మహా అద్భుతం.. ఎంటో తెలిస్తే ఔరా అంటారు..!

- Advertisement -

దేశంలో కరోనా విజృంభణ ఏంత ఘోరంగా ఉందో తెలిసిందే. రోజుకి నాలుగు లక్షల కేసులు నమోదు అవుతున్నాయి.. మరోవైపు మూడు వేలకు పైగా మరణాలు సంబవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. తెలంగాణలో సైతం నిన్నటి నుంచి పదిరోజుల వరకు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక గాంధీ ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్స్ తో కిక్కిరిసి పోతున్నాయి.

ఇటాంటి సమయంలో గాంధీ హాస్పిటల్ లో ఓ అద్భుతం జరిగింది. 110 సంవత్సరాల వయసు ఉన్న రామానంద తీర్ధ అనే వ్యక్తి కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. రామానంద తీర్థ అనే వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గత నెల ఏప్రిల్ 24వ తేదీన గాంధీ ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో ఆయన పరిస్థితి క్రిటికల్ స్టేజ్‌లో ఉందని వైద్యులు తెలిపారు. ఒకదశలో ఆయన బతకడం చాలా కష్టం అని భావించారు. అలాంటిది 15 రోజుల్లో రామానంద తీర్థ పూర్తిగా కోలుకున్నారు.

తాజాగా డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధమయ్యారు. పూర్తిగా కరోనా నుండి కోలుకున్న రామానందతీర్థను హాస్పిటల్ వర్గాలు డిశ్చార్జి చేశాయి. దీనిని గాంధీ హాస్పటల్ సిబ్బంది బయటికి విడుదల చేశారు‌. దేశంలో కరోనా బారిన పడి కోలుకున్న అత్యంత పెద్ద వయస్కుడు ఈ 110 ఏళ్ల రామానంద తీర్థ అని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు వెల్లడించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -