Sunday, May 5, 2024
- Advertisement -

రామతీర్థం విగ్రహ ధ్వంసంపై ఏపీ సర్కార్ ఊహించని ట్విస్ట్

- Advertisement -

విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండరాముడి విగ్రహం ధ్వంసం కేసులో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. ఉత్తరాంధ్ర అయోధ్య రామతీర్థం ఆలయ ట్రస్ట్ ఛైర్మన్‌ హోదా నుంచి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును తొలగిస్తూ శనివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రామతీర్థంతో పాటు పైడితల్లి, మందపల్లి ఆలయ ట్రస్టుల నుంచి కూడా తొలగించారు.ఆలయాల పర్యవేక్షణలో ఆయన విఫలమయ్యారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఇప్పటి వరకు 100 ఆలయాల చైర్మన్ బాధ్యతల నుంచి అశోక్ గజపతి రాజును దేవాదాయ శాఖ తప్పించింది.

కాగా, ఇప్పటికే అశోక్‌ గజపతిరాజును ఇప్పటికే ప్రతిష్టాత్మక సింహాచల దేవస్థానం చైర్మన్‌ పదవి నుంచి జగన్ సర్కార్ తొలగించిన విషయం తెలిసిందే. అలాగే, విజయనగరం సంస్థానాధీశులకు చెందిన మహారాజా అలక్‌ నారాయణ్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ (మాన్సాస్‌) ట్రస్టు అధ్యక్ష పదవి నుంచి కూడా తప్పించింది. ఈ రెండు పదవుల్లో ఆయన అన్న, మాజీ మంత్రి పూసపాటి ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును నియమించింది. తాజాగా మూడు దేవాలయాల బోర్డుల నుంచి ఆయనను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రామతీర్థంకు వచ్చిన చంద్రబాబు..బహిరంగసభలో ప్రసంగం ముగియగానే..ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

అసలేం జరిగిదంటే..
ఐదు రోజుల క్రితం రాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసంచేయడంతో వివాదం మొదలయింది. శ్రీరామచంద్రుని విగ్రహం తల భాగాన్ని పూర్తిగా తొలగించివేసి కోనేరులో పడేశారు దుండగులు. ఈ నెల 29న ఈ ఘటన వెలుగులోకొచ్చింది. ఉదయంపూట ఎప్పటిలానే కొండపైకి వెళ్లి ఆలయం తలుపులు తీసిన పూజారి…శిరస్సులేని రాముడి విగ్రహం చూసి హతాశుడయ్యారు. వెంటనే విషయాన్ని దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అందరూ కలిసి విస్తృతంగా గాలించగా…కోనేరులో విగ్రహం తల లభించింది.

విగ్రహాల ధ్వంసంపై ఏపి సీఎం జగన్ సీరియస్ వార్నింగ్!

30 మంది టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు తమకు టచ్‌లో ఉన్నారు?

సాగర్‌ ఉప ఎన్నిక : కారు పార్టీకి సవాలే!

నవలల ఆధారంగా వచ్చిన చిరంజీవి సినిమాలు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -