Thursday, April 25, 2024
- Advertisement -

3 కోట్ల గంజాయి పట్టివేత

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సప్లైయ్ పెరుగిపోతోంది. పోలీసులను బొల్తా కొట్టించడానికి అక్రమార్కులు వివిధ రూపాల్లో డ్రగ్స్‎ను తరలిస్తున్నారు. పోలీసుల ఎత్తులను పసిగడుతూ స్మగ్లరు పై ఎత్తులు వేస్తూ గంజాయిని తరలిస్తున్నారు. కాని వీటన్నింటికి పోలీసులు చెక్ పెడుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సరఫరా రోజురోజుకూ పెరిగిపోతుంది. స్మగ్లర్లు రోజు రోజుకూ గంజాయి సరఫరాను వివిధ రూపాల్లో తరలిస్తున్నారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈ రవాణా అధికంగా కొనసాగుతోంది. గతంలో విశాఖ జిల్లాలో గంజాయి మొక్కలను పెంచుతున్న గిరిజలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి వారి చేతనే గంజాయితోటను ధ్వంసం చేయించారు. గుంటూరు జిల్లాలో ఇంట్లో గంజాయి మొక్కను పెంచుతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశారు.

పోలీసులు ఎన్నిచర్యలు తీసుకున్నా స్మగ్లర్లు మాత్రం ఆగడంలేదు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా గంజాయిని తరలిస్తున్నారు. తాజాగా ఏపీలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్న సుమారు 3 కోట్ల, 30 లక్షలు విలువైన గంజాయిని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. లారీ ధ్వారా తరలిస్తున్న సుమారు 18 వందల 20 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు పోలీసుల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ లారీలో డ్రగ్స్‎ అమర్చిన కేటుగాళ్లు… ఎవ్వరికీ అనుమానాలు కలగకుండా గాంజాయిపై ఎరువుల బస్తాలు పరిచారు. ఒకవేల పోలీసులు వాహనాన్ని తనిఖీ చేసినా అందులో ఎరువులు ఉన్నట్లు చెప్పుకోవచ్చు, బస్తాల క్రింద పోలీసులు తనికీలు చేయరు కదా! అని స్మగ్లర్లు తమ వ్యూహన్ని అమలు చేశారు. కష్టం మీద ఏపీని దాటిక లారీ హైదరాబాద్‎లో మాత్రం దొరికి పోయారు.

జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ రెచ్చగోకుతుంది…? ఎందుకు..?

చంద్రబాబును నడిపిస్తున్న పికే..?

కేంద్రం అందుకే దిగొస్తుందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -