Sunday, May 5, 2024
- Advertisement -

ఏపీలో కరోనా కాటుకు 38 బలి

- Advertisement -

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ నేపధ్యంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా.. వ్యాక్సీన్ ఏర్పాట్లు చేసినా కేసలు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల ఎన్నికల ప్రచారాల్లో పాల్గొన్న వారు ఎక్కువగా కరోనా భారిన పడుతున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా ఏపీలో 9,716 కేసులు నమోదు అయ్యాయి. అలాగే 38 మంది కరోనా కారణంగా మృతి చెందారు. తాజాగా రాష్ట్రంలో మొత్తం 9,86,703 మంది క‌రోనాబారిన‌ప‌డ్డారు.

మృతుల సంఖ్య 7,510కి పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 9,18,985 మంది కోలుకున్నారు. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 60,208 యాక్టివ్‌ కేసులున్నాయి. కృష్ణా జిల్లాలో 10మంది, నెల్లూరులో 7, తూ.గో, శ్రీకాకుళంలో నలుగురు చిత్తూరు, ప్రకాశంలో ముగ్గురు, గుంటూరు, కర్నూలు, విశాఖలో ఇద్దరు, అనంతపురంలో ఒక్కరు మరణించారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రామాల్లో త్వరిత గతిన వ్యాక్సిన్ టీకాలు వేయించే కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ 60 లక్షల డోసులు సరఫరా చేయాలని లేఖలో జగన్ కోరారు. 

గుడ్ న్యూస్ : వారంలోగా 4 లక్షల రెమిడెసివిర్‌ ఇంజక్షన్లు!

కరోనా విషాదం.. ఆక్సిజన్ ట్యాంక్ లీకై 22 మంది మృతి!

నటి రష్మికకు గుండు.. అసలు కథ ఏంటీ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -