Thursday, May 2, 2024
- Advertisement -

అమరావతి పరమ డేంజర్ సిటీ

- Advertisement -

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి ని విశ్వ నగరం గా తీర్చి దిద్దుతాం అని ఒకపక్క ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బాగానే కహానీలు చెబుతున్నారు గానీ ఎక్కడ పని మాత్రం జరుగుతున్నట్టు కనపడ్డం లేదు. నిధులు లేక కనీస పని కూడా మొదలు అవ్వకుండా ఉండిపోయింది. అయితే శాస్త్రీయ అధ్యయనాలు చెబుతున్న దాని ప్రకారం అమరావతి నగరం చాలా పెద్ద డేంజర్ సిటీ అంటున్నారు వారు.

ఇప్పటికే ఈ ప్రాంతం లో భూకంప ప్రమాదాలు అధికం అనీ వరదల ముప్పు కూడా ఈ ప్రాంతం లో చాలా ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు. ఇవన్నీ సరిపోవు అన్నట్టు  కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు – ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సంయుక్తంగా చేసిన సర్వే ఇక్కడ కాలుష్యం విషయం లో కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదురుకోవాలి అని చెబుతోంది.

అమరావతికి చెరోవైపు ఉన్న విజయవాడ – గుంటూరు నగరాలతో పాటు వాటి పరిసరప్రాంతాలన్నీ వాయు – జల – ధ్వని కాలుష్కాలకు నెలవయ్యాయని తేల్చింది.  అంతేకాదు.. దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో ఈ రెండు నగరాలను చేర్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -