Thursday, March 28, 2024
- Advertisement -

జోరుగా కోడి పందాలు.. రంగంలోకి మహిళలు సైతం!

- Advertisement -

ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్ లో కోడిపందాల నిర్వహణ జోరుగా సాగుతోంది. కోడి పందాలు జరక్కుండా చూడాలని హైకోర్టు ఆదేశించినా సరే ప్రజాప్రతినిధులు సమక్షంలోనే కోడిపందాలు నిర్వహిస్తుండటం గమనార్హం. అరెస్టుల పర్వం కొనసాగుతున్నా.. పందెం రాయుళ్లు తమ పని తాము కానిస్తూనే ఉంటారు. తూర్పు గోదావరి,పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ ఎత్తున కోడి పందెం స్థావరాలు ఏర్పాటు చేశారు.

ఈ నాలుగు జిల్లాల్లో యధేచ్చగా కోడిపందాల నిర్వహణ సాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా మొత్తం 250 కి పైగా బరులు ఏర్పాటయ్యాయి. ఈ నేపథ్యంలో పందాల్లో కోట్లు చేతుమారుతున్నాయి.  పోలీసులు పండుగకు కొద్ది రోజుల ముందు నుండి కోడి కత్తులను స్వాధీనం చేసుకుని అప్పటికే ఏర్పాటు చేసిన బరులను పెద్ద ఎత్తున ద్వంశం చేసారు. 

అయితే మళ్లీ ఆ చుట్టుపక్కలనే పందాలు మొదలు పెట్టారు. ఈసారి మహిళా మణులు కూడా పందాలు కాస్తూ ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పలు ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -