Thursday, April 25, 2024
- Advertisement -

AP Employees Strike : ఏపీ ఉద్యోగుల సమ్మె సైరన్

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసేందుకు సిద్ధమయ్యారు. కొత్త పీఆర్సీని వ్యతిరేకిస్తూ సమ్మె బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 5 నుంచి సహాయ నిరాకరణ, ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెకు దిగబోతున్నట్లు వెల్లడించారు.

పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఈనెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించినట్టు పీఆర్సీ సాధన నమితి ప్రకటించింది. ఈ మేరకు సచివాలయంతో ప్రభుత్వ ప్రధాన కార్యరద్శిని కలిసి నోటీసులు అందజేశారు. అనంతరం వారు తమ ఉద్యమ కార్యాచరణను వెల్లడించారు.

నాలుగు ఉద్యోగ సంఘాల నాయకులు విజయవాడలో సమావేశం అయి చర్చించారు. అనంతరం విడివిడిగానూ మరోసారి చర్చించారు. ఫిబ్రవరి 7 నుంచి నిరవధిక సమ్మెకు దిగబోతున్నట్లు ఐక్య ప్రకటన చేశారు. ఇందులో ఏ రాజకీయ పార్టీని భాగస్వామ్యం చేయరాదని నిర్ణయం తీసుకున్నారు.

Also Read: ప్రగతి భవన్ ముందు మాజీ మంత్రి హల్ చల్.. ఎందుకు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -