ప్రగతి భవన్ ముందు మాజీ మంత్రి హల్ చల్.. ఎందుకు..?

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారిక నివాసం అయిన ప్రగతి భవన్ ఇటీవల ఆందోళనకారులకు కేంద్రంగా మారింది. ఇటీవల ఒక నిరుద్యోగి ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. తాజాగా మాజీ మంత్రి జె.సి. దివాకర్ రెడ్డి ప్రగతి భవన్ ముందు హల్ చల్ చేశారు.

బుధవారం ప్రగతి భవన్ ముందుకు చేరుకున్న ఆయన ముఖ్యమంత్రి కెసిఆర్ ను కలవాలని కోరగా అక్కడున్న భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. అపాయింట్ మెంట్ లేకుండా లోపలికి అనుమతి లేదని వారు స్పష్టం చేశారు. కాగా తాను మాజీ మంత్రిని అని తనకు అపాయింట్ మెంట్ అవసరం లేదని లోపలికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని వారితో వాగ్వాదానికి దిగారు.

- Advertisement -

కనీసం మంత్రి కెటిఆర్ ను అయినా కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరగా … అపాయింట్ మెంట్ లేకుండా ఎవ్వరినీ కలవడానికి వీలు లేదని భద్రతా సిబ్బంది ఖరాఖండీగా చెప్పడంతో మరోసారి వారితో తీవ్ర వాగ్వాదానికి దిగారు జెసి. ఈసారి తాను అపాయింట్మెంతో వచ్చి మీ సంగతి చెబుతానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ప్రగతి భవన్ ముందు న్యూసెన్స్ చేసిన జె.సి.పై ఎటువంటి కేసును నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Also Read: చిరు చిన్న కూతురు మళ్ళీ విడాకులు..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -