Friday, May 3, 2024
- Advertisement -

ఆ విషయంలో మాట నిలబెట్టుకున్న సీఎం జగన్

- Advertisement -

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం వైఎ స్ జగన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. ప్రధానంగా అంచెల వారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రులు కూడా చేయలేని పనిని జగన్ చేసి చూపిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు మద్యమే. అలాంటి ప్రధాన ఆదాయ వనరును ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్ ప్రభుత్వం మద్యపానం దిశగా అడుగులు వేస్తోంది.

అధికారంలోకి రాగానే బెల్టు షాపులపై ఉక్కుపాదం మోపింది. అనంతరం నూతన మద్యం పాలసీని ప్రకటించింది. మద్యం దుకాణాలను తగ్గించడంతోపాటు స్వయంగా ప్రభుత్వమే మద్యం అమ్మకాలు చేపట్టాలని నిర్ణయించింది.మద్య నిషేధంలో భాగంగా మద్యానికి బానిసలైన వారిలో మార్పు తెచ్చేందుకు ప్రభుత్వమే డీ అడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. వాటి కోసం సుమారు రూ.500 కోట్లు కేటాయించింది.

బెల్టుషాపుల‌పై ఉక్కుపాదం ఫ‌లితంగా మ‌ద్యం వినియోగం భారీగా త‌గ్గుతోంది. అక్టోబ‌ర్ నుంచి 20% మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యనూ తగ్గిస్తాం. అక్రమ మద్యాన్ని,నాటుసారాను అరికట్టేందుకు గ్రామసచివాలయాల్లో మహిళా పోలీసులను నియమిస్తున్నాం. దశలవారీ మద్య నిషేధం దిశగా అడుగులు వేస్తున్నాం.’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -