Thursday, May 9, 2024
- Advertisement -

రెండు రోజులు నిబంధనలనుకఠినంగా అమలు చేస్తాం…ఈసీ

- Advertisement -

ఎన్నికల ప్రచారం ముగియడంతో ఈసీ పోలింగ్ పై దృష్టి సారించింది. రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలు ఉల్లంగించకుండా రెండు రోజులు కఠినంగా ఎన్నికల నిబంధనలను అమలు చేస్తామని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లోకి బయట వ్యక్తులను అనుమతించమని చెప్పారు. ఏప్రిల్ 11న ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు.

గత ఎన్నికల్లో 78 శాతం పోలింగ్ నమోదైందని, ఈసారి పోలింగ్ శాతం 80 దాటుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. పోలింగ్ బూత్ లో ఏజెంట్లు గంట ముందే చేరుకోవాలని సూచించారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో రూ.118 కోట్లు నగదు సీజ్ చేసినట్లు తెలిపారు. డబ్బులను స్వాధీనం చేసుకోవడంతో దేశంలో ఏపీ మూడో స్థానంలో ఉందన్నారు.మరోవైపు 24.15 కోట్లు విలువ చేసే మద్యాన్ని సీజ్ చేసినట్లు స్పష్టం చేశారు.

సీ-విజిల్ యాప్ లో 5,607 ఫిర్యాదులు నమోదయ్యాయని, పెండింగ్ లో 26 ఫిర్యాదులు ఉన్నట్టు స్పష్టం చేశారు. సీ-విజిల్ లో ఎక్కువగా తప్పుడు కేసులు నమోదవుతున్నాయని అన్నారు. సౌకర్యాలు ఉన్న ప్రత పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. రవాణాకు సంబంధించి 7,300 బస్సులు వినియోగిస్తున్నట్లు ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -