Saturday, April 27, 2024
- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ప‌క్షిగా రామ‌చిలుక‌, పుస్పంగా మ‌ల్లెపువ్వు…

- Advertisement -

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత ప్ర‌భుత్వ అధికారిక చిహ్నాల్లో ప్ర‌భుత్వం కొన్ని మార్పులు చేసింది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప‌క్షిగా పాల‌పిట్ట, పుస్పంxe క‌మ‌ళం ఉన్న సంగ‌తి తెలిసిందే. విభ‌జ‌న త‌ర్వాత పాల‌పిట్ట‌ను తెలంగాణ రాష్ట్ర‌ప‌క్షిగా గుర్తించింది. దీంతో ఏపీ రాష్ట్ర పక్షిగా ప్రస్తుతం రామచిలుకను ప్రభుత్వం ఎంపిక చేసింది.

గతంలో రాష్ట్ర పుష్పంగా ఉన్న కలువ స్థానంలో మల్లెపువ్వు చేర్చారు. ఎప్పటిలాగే రాష్ట్ర వృక్షంగా వేప చెట్టు, జంతువుగా కృష్ణ జింక‌ కొనసాగుతాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్‌ను బుధవారం వెలువరించింది. అటవీ, పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ పేరుతో అధికారిక ప్రకటన వెలువడింది.

ఉమ్మడి రాష్ట్రంలో ‘ప్రగతి చక్రం’అధికారిక చిహ్నంగా ఉండేది. అయితే దీనిలో కూడా మార్పులు చేస్తూ ‘సన్ రైజ్ స్టేట్’‌ను నవ్యాంధ్ర అధికారిక చిహ్నంగా రూపొందించింది. రాష్ట్రం విడిపోయిన త‌ర్వాత తెలంగా సంసృతికి అనుగునంగా అధికారిక చిహ్నాల్లో మార్పులు చేసిసింది.తాజా చిహ్నాలు జూన్ ఆరు నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -