Saturday, May 11, 2024
- Advertisement -

పవన్ మాటకు.. బీజేపీ, టీడీపీలు ఇచ్చిన విలువ ఇది!

- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు విలువనిచ్చాయి తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు. పవన్ కోరిక మేరకు.. ఆయన సిఫార్సు మేరకు వ్యవహరించాయి ఆ పార్టీలు. ఎన్నికల్లో తమకు మద్దతు పలికిన హీరోకు ఆ పార్టీలు ఇలా విధేయతను చాటుకొన్నాయి. పవన్ మాటను తాము వింటున్నాం.. మన మా వాడే..అనే ఇండికేషన్ ను కూడా ఇచ్చాయి ఆ పార్టీలు! ఇంతకీ విషయం ఏమిటంటే.. ఇది ఎమ్మెల్సీ సీటు వ్యవహారంలో!

మిత్రధర్మం కింద భారతీయ జనతా పార్టీకి ఒక ఎమ్మెల్సీ సీటును కేటాయించింది తెలుగుదేశం పార్టీ. ఎన్నికల్లో తమతో కలిసిపోటీచేసి.. ఉమ్మడి ప్రభుత్వంలో భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం ఈ విధంగా ప్రాధాన్యత  ఇచ్చింది. ఒక ఎమ్మెల్సీ సీటును ఇవ్వడం ద్వారా మిత్ర ధర్మాన్ని పాటించింది. ఇదే సమయంలో ఆ ఎమ్మెల్సీ సీటు భారతీయ జనతా పార్టీ నేత సోమూవీర్రాజుకు దక్కడం మరింత ఆసక్తికరమైన విషయం.

ఈ వీర్రాజు ఎవరో కాదు.. బీజేపీలో పవన్ కు బాగా సన్నిహితమైన వ్యక్తి. ఆది నుంచి పవన్ తో టచ్ లో ఉన్న కమలనాథుడు. ఈ నేపథ్యంలో వీర్రాజు.. చాలా రోజులు తన పదవి కోసం జనసేన అధినేత చేత లాబీయింగ్ చేయించుకొన్నాడు. తెలుగుదేశం, బీజేపీ నాయకత్వాలపై పవన్ చేత ఒత్తిడి తెప్పించి.. పదవిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు ఆ ప్రయత్నాలు నెరవేరాయి. పవన్ సిఫార్సు మేరకు ఆయనకు పదవి దక్కింది.

దీంతో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కూడా పవన్ కు విలువనిస్తున్నట్టే అయ్యింది. మొత్తానికి పవన్ చక్రం తిరుగుతోందనమాట. ముందు ముందు ఇది మరింత ఊపును సంపాదిస్తుందేమో చూడాలి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -