Tuesday, May 7, 2024
- Advertisement -

స‌మావేశాలు చివ‌రిరోజుకూడా ఎంపీల‌కు తీవ్ర నిరాశ మిగిల్చిన జైట్లీ…

- Advertisement -

బ‌డ్జెట్‌పై రాజ్య‌స‌భ‌లో ఈ రోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌సంగించారు. కొన్ని రోజులుగా ఏపీకీ న్యాయం చేయాల‌ని ఆందోళ‌న చేస్తున్న ఎంపీల చేతిలో మ‌రో సారి కొబ్బ‌రి చిప్ప చేతిలో పెట్టారు. బ‌డ్జెట్ స‌మావేశాల చివ‌రిరోజు నిర్థిష్ట‌మైన హామీ వ‌స్తుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న నేత‌ల‌కు మ‌రో సారి నిరాశె మిగిలింది.

ఆయ‌న చేసిన ప్ర‌సంగంలో పాత పాటే పాడారు త‌ప్ప కొత్త‌దేమిలేదు. ఆయ‌న ప్ర‌సంగంలో ఏపీ కొత్త‌ రాజ‌ధాని, పోల‌వ‌రంకి నిధులిచ్చామ‌ని అన్నారు. ఏపీలో ఉక్కు కర్మాగారం, తదితర అంశాలకు సంబంధించి శాఖలు పనిచేస్తున్నాయని, వాటిపై ఇప్ప‌టికే దృష్టి పెట్టామ‌ని అన్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు పనులు సాగుతున్నాయని చెప్పారు. ఏపీకి పలు జాతీయ సంస్థలను కేటాయించామని, వాటికి కూడా నిధులు ఇస్తున్నామని, ఇప్పటికే పోలవరానికి పలుసార్లు నిధులు ఇచ్చామని చెప్పారు.

విభజన చట్టం హామీలకు సంబంధించి కొన్ని అమలు చేశామని, మరికొన్ని పరోగతిలో ఉన్నాయని చెప్పారు. అరుణ్ జైట్లీ నిన్న చెప్పిన అంశాల‌నే మ‌ళ్లీ తిప్పి తిప్పి చెప్ప‌డం టీడీపీ ఎంపీల‌ను మ‌రింత ఆగ్ర‌హానికి గురి చేసింది. మ‌రి ఏపీ ఎంపీలు ఎలా ముందుకెల్తారో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -