Monday, April 29, 2024
- Advertisement -

మ‌హానాడులో కార్య‌క‌ర్త‌ల‌ను.. బ్రతిమలాడుకుంటున్న బాబు

- Advertisement -
Chief Minister N Chandrababu Naidu to kicks off TDP Mahanadu in Visakhapatnam at AU

ప్ర‌తీ సంవ‌త్స‌రం టీడీపీ నిర్వ‌హించే మ‌హానాడు ఉద్దేశ్యం పార్టీ చేస్తున్న కార్య‌క్ర‌మాలు..భ‌విష్య‌త్తులో పార్టీ అనుస‌రించ‌బోయే నిర్న‌యాల‌గురించి ప్ర‌జాప్ర‌తినిధుల‌కు కార్య‌క‌ర్త‌ల‌కు దిశానిర్దేశం చేస్తుంది.

కాని ఇప్పుడు విశాఖ‌లో నిర్వ‌హిస్తున్న మ‌హానాడు కార్య‌క‌ర్త‌ల‌కు,ప్ర‌జాప్ర‌తినిధిల‌కు ఆట‌విడుపుగా త‌యార‌య్యింది. దీంతో బాబుకు దిమ్మ‌తిరిగినంత ప‌నయ్యింది.
ఇక ఎప్ప‌టిలాగానే చంద్రబాబు త‌న ప్రసంగాన్ని మొద‌లు పెట్ట‌డంతోనే తెలుగు త‌మ్ముల్లు ప‌రేషాన్‌కు గుర‌య్యారు. రోజు మాదిరిగానే బాబు ప్ర‌సంగం ఉండ‌టం … కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో తెలుగు తమ్ముళ్లకు పిచ్చెక్కింది. రోజూ టీవీల్లో గంట పాటు ప్రెస్‌మీట్ పెట్టి చెప్పే అంశాలనే చంద్రబాబు మరోసారి ఊదేశారు. అంతే బాబు ప్ర‌సంగం మ‌ధ్య‌లోనే టీడీపీ కార్యకర్తలు మెల్లగా జారుకున్నారు.

{loadmodule mod_custom,Side Ad 1}

చంద్రబాబు మాట్లాడుతుండగానే నేతలంతా భోజనాల వద్ద క్యూ కట్టారు. అలా భోజనం చేసిన వారు చంద్రబాబు ప్రసంగం వినేందుకు తిరిగి రాలేదు. నేరుగా గుంపులు గుంపులుగా విశాఖ బీచ్‌కు చెక్కేశారు. అలా వెళ్లిన వాళ్లలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు. ఇలా అందరూ భోజనాలు, ఆ తర్వాత బీచ్‌కు చెక్కేయడంతో చంద్రబాబు ప్రసంగం ముగిసేసరికి మహానాడు ప్రాంగణంలో భారీగా ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. దీంతో పరిస్థితిని గమనించిన చంద్రబాబు… దయచేసి బయటకు వెళ్లకండి అంటూ కార్క‌ర్త‌ల‌ను బ‌తిమ‌లాడుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది..

{loadmodule mod_custom,Side Ad 2}

తమ్ముళ్లూ ఇప్పుడే బయటకు వెళ్లకండి. కావాలంటే సాయంత్రం బీచ్‌కు వెళ్లండి , ఇంకా ఒకటి రెండు రోజులు ఇక్కడే ఉంటాం , సభ జరుగుతున్నప్పుడు బయటకు వెళ్లకండి అంటూ చంద్రబాబు స్వయంగా విజ్ఞప్తి చేశారు. అయినా సరే తమ్ముళ్లు ఆహారం తినేసి ఆహ్లాదం కోసం వెళ్లిపోయారు.అంతే అక్క‌డున్న సీనియ‌ర్లంతా ముక్కున వేలేసుకున్నారు. మొత్తం మీద తెలుగు తమ్ముళ్లు మహానాడు పుణ్యమా అని బీచ్‌లో బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}HfjMUQGHaww{/youtube}

Also Read

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -