Thursday, May 16, 2024
- Advertisement -

వ‌ల‌స‌ల‌తో బ‌లోపేత మ‌వుతున్న వైసీపీ

- Advertisement -
Chittoor TDP MP Naramilli Sivaprasad likely Join in YSRCP

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌రిస్థితి ముందు నుయ్య గెన‌క గొయ్యిలాగా త‌యార‌య్యింది .రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష‌పార్టీనే లేకుండా చేయాల‌ని నిస్సిగ్గుగా పార్టీ పిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు.

అపిరాయింపులే ఇప్పుడు బాబును కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌లో పిరాయింపు ఎమ్మెల్యేల‌కు పెద్ద‌పీట వేయ‌డంతో అసంతృప్తి తారాస్థాయికి చేరి చివ‌రికి బాబునే కాల్చుకుతింటోంది.

{loadmodule mod_custom,Side Ad 1}

పార్టీకోసం మొద‌టి నుంచి క‌ష్ట‌ప‌డుతున్న వారికి కాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి ప‌దువులిచ్చి పెద్ద‌పీట వేయ‌డంతో సీనియ‌ర్ నాయ‌కులంతా బాబు మీద తిరుగుబాటు ఎగ‌ర‌వేసినంత ప‌నిచేశారు.సీనియ‌ర్ల‌లో ముఖ్యంగా బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి,ప‌య్యావుల కేశ‌వ్‌,బోడా ఉమా త‌దిత‌రులు టీడీపీ అధిష్టానంమీద అసంతృప్తి వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే.ఇదే క్ర‌మంలో చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్ కూడా బాబు మీద తిరుగుబాటు జెండా ఎగ‌ర‌వేశారు.
గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ద‌ళిత స‌మాజిక వ‌ర్గానికి ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌కుండా ….మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ద‌ళితుల‌కు ద‌క్కాల్సిన మంత్రి ప‌ద‌వులు ఇవ్వ‌కుండా పిరాయింపుల‌కు పెద్ద‌పీట వేశి ద‌ళితుల‌ను అవ‌మాన ప‌రిచాడంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తంచేశారు శివ‌ప్ర‌సాద్‌.ఆయ‌న‌పై నేరుగా విమ‌ర్శించ‌కుండా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దావెంక‌న్న‌ను ఉసిగొల్పారు. అధికారాన్ని అడ్డంపెట్టుకొని భూకుంభ‌కోనాల‌కు పాల్ప‌డ్డాడంటూ విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టి శివ‌ప్ర‌సాద్‌ను తిట్టించారు.

{loadmodule mod_custom,Side Ad 2}

టీడీపీలో బ్యాంకుల‌కు వంద‌ల‌కోట్లు ఎగ్గొట్టిన గంటా శ్రీనివాస‌రావును విమ‌ర్శించ‌కుండా కేవ‌లం ద‌ళిత నేత అయిన శివ‌ప్ర‌సాద్‌ను విమ‌ర్శించ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది.ద‌ళితుల ప‌ట్ల బాబు అనుస‌రిస్తున్న తీరుకు వ్య‌తిరేకంగా శివ‌ప్ర‌సాద్‌తోపాటు ద‌ళిత నేత‌లంతా వైసీపీ తీర్ధం పుచ్చు కొనేందుకు సిద్దంగా ఉన్న‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ న్యూజిలాండ్ ప‌ర్య‌ట‌న నుంచి తిరిగి వ‌చ్చిన వెంట‌నే చిత్తూరులో బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటుచేసి వైసీపీ ఖండువా క‌ప్పుకోనున్న‌ట్లు ఆయ‌న‌వ‌ర్గం చెప్ప‌డంతో ….టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

{youtube}Ni2P-N602Tg{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -