Friday, April 26, 2024
- Advertisement -

పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి సీఐడీ ప్రశ్నలు..!

- Advertisement -

పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తికి మూడు రోజుల సీఐడీ కస్టడీ ముగిసింది. గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో కోర్టు అనుమతితో మూడు రోజులపాటు విచారణ జరిపారు. ప్రవీణ్‌కు బెయిల్‌ మంజూరు కాలేదని, ఈనెల 25న వాదనలున్నాయని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. జ్యుడీషియల్‌ కస్టడీ నుంచి 3 రోజుల విచారణకు తీసుకున్న పోలీసులు బుధవారం మధ్యాహ్నం నుంచి శనివారం మధ్యాహ్నం వరకు వివిధ అంశాలపై ఆరా తీశారు.

తానే దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేశానని, అనేక పల్లెలను క్రైస్తవ గ్రామాలుగా మార్చానని చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అంశాలతోపాటు పలు కోణాల్లో ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. ఇంకా కొంత సమాచారం అవసరమని, తిరిగి ప్రశ్నించాల్సిన అవసరం ఉందని సీఐడీ పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

ఇందుకోసం మళ్లీ కస్టడీకి తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు ప్రవీణ్‌ కుటుంబీకులు, ఆయన సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో కొందరికి సమన్లు ఇచ్చి సీఐడీ కార్యాలయానికి పిలిపించి విచారణ చేస్తున్నారు. శనివారం మరి కొందరిని విచారణ చేసి వారినుంచి వ్యక్తిగత వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -