Thursday, April 25, 2024
- Advertisement -

మాజీ ఐఏఎస్‌ ఇంట్లో సాధాలు… రాధాకృష్ణకు అక్కడేంపని..?

- Advertisement -

మాజీ ఐఏఎస్‌ అధికారికి లక్ష్మీరాకాయణకు ఏపీ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మాజీ ఐఏఎస్‌ అధికారికి సీఐడీ ఎందుకు నోటీసులు ఇచ్చెందుకు ప్రయత్నించింది.. నోటీసులను తాను తీసుకోవడానికి మాజీ ఐఏఎస్‌ ఎందుకు నిరాకరించారు. సీడీఐ సోధాలు చేస్తుండగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ అక్కడికి ఎందుకు వెళ్లారు. మాజీ ఐఏఎస్‌కు నిజంగానే కళ్లు తిరిగాయా.. ఇది ఇప్పుడు ఏపీ రాజకియాల్లో హాట్‌ టాపిగ్‌గా మారింది.

స్కిల్ డెవలప్‌మెంట్‌ కుంభకోణం దర్యాప్తును సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. చంద్రబాబు పాలన సమయంలో ఐఏఎస్‌గా విధులు నిర్వహించిన లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు చేశారు. ఈ నెల 13 విచారణకు హాజరు కావాలని సీఐడీ అధికారులు లక్ష్మీనారాయణకు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేయగా దీనికి ఆయన నిరాకరించారు. దీంతో అధికారులు నోటీసులను అధికారి కుటుంబ సభ్యులకు అందించారు.

లక్ష్మీనారాయణ ఇంట్లో సీఐడీ అధికారులు సోదాలు చేశారు. ఈ దాడుల్లో స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు సంభందించిన పలు కీలక ఫైళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో లోభీపీతో లక్ష్మీనారాయణ కళ్లు తిరిగి పడిపోయారు. ఆయనను ఆస్పత్రికి తరలించిన అధికారులు లక్ష్మీనారాయణపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

ఇదంతా ఒకలా ఉండగా.. లక్ష్మీ నారాయణ ఇంట్లో సోదాలు జరుగుతుండగా ABN ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లాడు. దీంతో పెద్ద చర్చే మొదలైంది. రాధాకృష్ణ అక్కడికి ఎందుకు వెళ్లారు. రాధాకృష్ణకు సంభందించిన ఫైళ్లు ఏమైనా లక్ష్మీనారాయణ వద్ద ఉన్నాయా.. లేక రైడ్స్ జరుగుతున్నాయని తెలియక స్నేహ పూర్వకంగా వెళ్లారా అని పలువురు రాజకీయ విశ్లేషకుల్లో ప్రశ్నలు ప్రాంభమయ్యాయి. మరోవైపు బాబు గుట్టు బయటపడకుండా బాబే రాధాకృష్ణను అక్కడికి పంపించారా అనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబుకు పట్టిన గతే కేసీఆర్‌కు పడుతుంది

చంద్రబాబు పై మరోసారి ఫైర్ అయిన అంబటి

చంద్రబాబుకు సజ్జల కౌంటర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -