త‌ప్ప తాగి.. కారు కింద‌కు దూరిన తెలుగు క‌మెడియ‌న్

- Advertisement -

డ్రంక్ అండ్ డ్ర‌వ్ ప‌రీక్ష‌లు చేప‌డుతున్న‌ప్పుడు జ‌రిగే సంఘ‌ట‌న‌లు విచిత్రంగా ఉంటాయి. న‌వ్వు త‌ప్పిస్తూ వాళ్లు చేసే ఓవరాక్ష‌న్.. బిల్డ‌ప్ త‌దిత‌ర న‌వ్వులు పుట్టించ‌డ‌మే కాక చిరాకు కూడా తెప్పిస్తుంటాయి. వాళ్లు చేసే వెర్రి వేషాలు ఒక్కోసారి పోలీసుల‌ను చిర్రెత్తిక్కిస్తాయి. అలాంటి సంఘ‌ట‌న‌లు దేశ‌వ్యాప్తంగా ఎన్నో చోటుచేసుకుంటున్నాయి. ఆ సంఘ‌ట‌న‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతుంటాయి.

నిన్న శ‌నివారం హైద‌రాబాద్ జూబ్లీహిల్స్‌లో నిర్వ‌హించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తెలుగు క‌మెడియ‌న్ చిత్రంగా ప్ర‌వ‌ర్తించాడు. తాను తాగి వాహ‌నం న‌డుపుతుండ‌గా పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప‌రీక్ష‌లు చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో అత‌డు దూరంగా గ‌మ‌నించి ఏమీ చేయాలో పాలుపోలేదు. వెంట‌నే స్నేహితుల‌కు త‌న కారు ఇచ్చాడు. ఎక్క‌డ ప‌ట్టుబ‌డ‌తానోన‌ని కారు కింద‌కు దూరాడు. దాదాపు ప‌ది ప‌దిహేను నిమిషాలు కారు కింద దూరి న‌క్కి కూర్చున్నాడు. ఆ స‌మ‌యంలో కారు కింద ఇబ్బందిగా ఉన్నా అలాగే ఉన్నాడు. మీడియాను చూసి కారు కింద‌కు దూరాడు. అయినా వ‌దిలితేనా.. పోలీసులు ప‌ట్టుకొని కారును సీజ్ చేశారు.

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -