డేంజర్ బెల్.. తెలంగాణ‌లో కొత్త‌గా 2,909 మందికి కరోనా!

- Advertisement -

తెలంగాణలో కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వందల్లో ఉన్న పాజిటివ్ కేసులు కాస్త సెకండ్ వేవ్‌తో వేలల్లోకి చేరాయి. 2,909 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

అదే సమయంలో 584 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,24,091కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,04,548 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,752గా ఉంది.

- Advertisement -

కాగా, నేటి మధ్యాహ్నం 12 గంటలకు కోటి లోని కమాండ్ కంట్రోల్ రూం లో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సమావేశం కానున్నారు. కరోనా చికిత్స ఏర్పాట్లను సమీక్షించనున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరినీ అప్రమత్తం చేయనున్నారు.

హెల్మెట్​తో ఓటు వేసిన నాయకుడు.. ఎందుకంటే..?

ఎముక‌ల బలంకోసం వీటిని తినా‌ల్సిందే!

నేటి పంచాంగం, శనివారం (10-04-2021)

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -