దేశంలో మళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

- Advertisement -

దేశంలో కరోనా వైరస్ (కోవిడ్-19) కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 46,759 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి క‌రోనాతో మ‌రో 509 మంది మృతి చెందారు. దీంతో దేశంలో క‌రోనా కేసుల సంఖ్య మొత్తం 3,26,49,947కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 4,37,370కి పెరిగింది.

అలాగే నిన్న క‌రోనా నుంచి 31,374 మంది కోలుకున్నారు. 3,59,775 మందికి ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్‌ల‌లో చికిత్స అందుతోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 62,29,89,134 డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు. నిన్న ఒక్క రోజే 1,03,35,290 డోసుల వ్యాక్సిన్లను వినియోగించారు.

మరో వైపు కేరళలో రోజుకు 30 వేల కరోనా కేసులు నమోదవుతుండడంతో కేరళ ప్రభుత్వం మరోసారి లాక్‌డౌన్ విధించనుంది.

Also Read: కేరళ లో మళ్లీ విజృబిస్తున్న కరోనా..!

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -