Thursday, April 25, 2024
- Advertisement -

ఇంటి దగ్గరికి ప్రచారం చేస్తూ ఎవరైన వస్తె లెక్క పెట్టండి..!

- Advertisement -

మున్సిపల్ ఎన్నికల్లో ఐదుగురికి మించి ఇంటింటి ప్రచారం చేయవద్దని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. కొవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయనే విషయాన్ని మరిచిపోవద్దన్నారు. రోడ్డు షోలకు ఏకీకృత విండో ద్వారా అనుమతి ఇస్తామని వెల్లడించారు. మద్యం, డబ్బు పంపిణీ అరికట్టేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.

బలవంతపు చర్యల వల్ల పోటీ నుంచి విరమించుకున్నామని కొందరు చెప్పారని.. ఈ అంశంపై త్వరలో తుది ఆదేశాలు జారీ చేస్తామని చెప్పారు. స్క్రూటినీలో తిరస్కరించిన వారి అభిప్రాయాలు తీసుకోమని వివరించారు. అన్ని జిల్లా అధికారులు, సిబ్బంది మంచి చర్యలు తీసుకుంటున్నారని ప్రశంసించారు. గతంలో కంటే ఓటింగ్ శాతం మరింత పెరగాలని కోరుకుంటున్నామని అభిప్రాయపడ్డారు.

ఎన్నికలను పారదర్శకంగా పటిష్టంగా జరిపేందుకే ప్రాంతీయ సమావేశాలు నిర్వహిస్తున్నాం. రేపు అన్ని రాజకీయ పక్షాలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాం. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అదే స్పూర్తితో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యం. ఓటు హక్కు ఎక్కడుందో తెలుసుకునేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాం.

ప్రభుత్వ సిబ్బంది ద్వారా ఓటరు స్లిప్పులు 5వ తేదీ లోపు ఇవ్వాలని నిర్ణయించాం. వాలంటీర్ల వ్యవస్థ దుర్వినియోగం జరుగుతోందని ఫిర్యాదులు వచ్చాయి.అందువల్లే మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్ల సేవలను నిషేధించాం. వాలంటీర్లు కోడ్ ఆఫ్ కండక్ట్ మీరితే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. వాలంటీర్లు పరిధిని దాటి ప్రవర్తించవద్దు అని ఎస్ఈసీ చెప్పారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రవిశాస్త్రి!

మాల్దీవుల‌లో పిచ్చెక్కిస్తున్న బిపాసా అందాలు!

ఈనెల 16కు రైలు దహనం కేసు వాయిదా.. కారణం అదేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -