Friday, May 24, 2024
- Advertisement -

గృహాల వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్ బిఐ, ఎస్బిహెచ్

- Advertisement -

రిజర్వ్ బ్యాంకు రెపో, రివర్స్ రెపో వడ్డీ రేట్లు తగ్గించడంతో మధ్యతరగతికి మేలు జరిగింది. జాతీయ బ్యాంకులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ గృహాలకు ఇచ్చే వడ్డీ రేట్లను తగ్గించాయి.

ఎస్ బి ఐ తగ్గించిన వడ్డీ రేట్ల ప్రకారం మహిళ ఖాతాదారులు మినహా మిగిలిన వారికి 9.45 శాతం వడ్డీ, మహిళలకు 9.4 శాతం వడ్డీ రేటును నిర్ణయించారు. ఇంతకు ముందు అది 9.55 శాతం, 9.5 శాతంగా ఉండేది. ఏప్రిల్ 1 నుంచి ఈ వడ్డీ రేట్లు అమలులోకి వస్తాయని బ్యాంకు తెలిపింది. ఇక ఎస్ బి హెచ్ లో బేస్ రేటు 9.75 గాను, బెంచ్ మార్క్ లెండింగ్ రేటు 14.90 శాతం గాను ఉంది. బిపిఎల్ ఆర్ ప్రాతిపదికన రుణాలు తీసుకున్న కూడా నిర్ధిష్ట నిబంధనల ప్రకారం ఎంసిఎల్ ఆర్ విధానంలోకి మారవచ్చునని ఎస్ బి హెచ్ పేర్కొంది. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -