Monday, May 6, 2024
- Advertisement -

ఇద్దరి మధ్యా స్నేహం కుదిరినట్టే(నా?)!

- Advertisement -

పాత స్నేహితులు.. కొత్త రాజకీయాలు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును చూసిన ఎవరైనా ఇలాగే అనుకుంటున్నారు.

ఇన్నాళ్లూ ఓటుకు నోటు కేసుతో పాటు.. చాలా విషయాల్లో ఇద్దరి మధ్య విమర్శల యుద్ధం నడిచింది. పార్టీ నేతల మధ్య కూడా ఇదే తీరు కనిపించింది. కానీ.. కొన్నాళ్లుగా సీన్ మారుతోంది. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి శంకుస్థాపనకు.. కేసీఆర్ ను బాబు స్వయంగా ఆహ్వానించిన దగ్గర్నుంచి పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది.

బాబు ఆహ్వానాన్ని మన్నించిన కేసీఆర్.. స్వయంగా అమరావతి వెళ్లి అక్కడి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. ఇప్పుడు.. లోక కళ్యాణం పేరుతో నిర్వహించనున్న ఆయత చండీ యాగానికి రావాలంటూ… బాబును ఆహ్వానించారు కేసీఆర్. ప్రత్యేక హెలికాప్టర్ లో మంత్రి ఈటెల రాజేందర్ తో కలిసి వెళ్లి మరీ బాబును ఆహ్వానించారాయన. పాత మిత్రుడు వచ్చేసరికి చంద్రబాబు కూడా చాలా సమయం కేటాయించారు.

ఇద్దరూ కలిసి ఏకాంతంగా మాట్లాడుకున్నారు. రాజకీయాల నుంచి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితుల వరకూ అన్నీ చర్చించుకున్నారు. తర్వాత కేసీఆర్ టీమ్ కు.. చంద్రబాబు కమ్మని ఆంధ్రా వంటకాలతో అద్భుతమైన విందు కూడా ఏర్పాటు చేశారు. ఓ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తే ఇంతలా గౌరవ మర్యాదలు ఉంటాయని ఎవరూ ఊహించలేనంతగా ఏర్పాట్లు చేశారు.

ఇవన్నీ గమనిస్తుంటే.. చంద్రబాబు, కేసీఆర్ మధ్య పాత స్నేహం మళ్లీ చిగురిస్తోందని కొందరు లెక్కలు వేస్తున్నారు. బాబు కంటే దూకుడుగా రాజకీయ నిర్ణయాలు అమలు చేసే కేసీఆర్ చొరవే ఇందుకు కారణమని కూడా చెప్పుకొస్తున్నారు. చూడాలి… ఈ ముచ్చట ఎంత వరకు నిజమవుతుందో!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -