Wednesday, April 24, 2024
- Advertisement -

ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై….బాబు,లోకేష్ వేర్వేరు ప్ర‌క‌ట‌న‌లు.

- Advertisement -
Different voice of Chandrababu and Lokesh on Earlear election

తండ్రీ కొడుకుల మ‌ధ్య అవ‌గాహ‌న‌లేదా..! ఇద్ద‌రిలో ఎవ‌రి మాట న‌మ్మాలి…? వన్ నేషన్-వన్ ఎలక్షన్ పై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇద్ద‌రి మ‌ధ్య స‌మ‌న్వ‌య‌లోపం కొట్టోచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది.

వన్ నేషన్-వన్ ఎలక్షన్ పద్ధతికి ప్రధాని మోడీ మొగ్గు చూపుతున్న వేళ.. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ నేతలతో వ్యాఖ్యానించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కలిసికట్టుగా పని చేస్తే మళ్లీ టీడీపీదే విజయం అని కూడా ఆయన అన్నారు. అంతేకాదు మోడీ మొగ్గుచూపిన వన్ నేషన్ -వన్ ఎలక్షన్ పద్ధతిని కూడా చంద్రబాబు స్వాగతించారు. అది మంచి విధానమే అని ప్రశంసించారు.ఇక ఎన్నిక‌ల‌కు అంద‌రూ సిద్ధంగా ఉండాల‌ని పార్టీ శ్రేనుల‌కు పిలుపు నిచ్చారు.నియేజ వ‌ర్గాల‌కు కూడా ఇంచార్ట్ ల‌ను నియ‌మించారు.
లోకేష్ మాత్రం ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై విరుధ్ద‌ప్ర‌క‌ట‌న చేశారు.ముందస్తు ఎన్నికలు వస్తాయని సీఎం చంద్రబాబు ఎప్పుడూ చెప్పలేదని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని మాత్రమే సీఎం చెప్పారని లోకేష్ వ్యాఖ్యానించారు.ఏడాది ముందుగా ఎన్నికలంటే ఏ రాష్ట్రమైనా ఎందుకు ఒప్పుకుంటుందని మంత్రి నారా లోకేష్‌ ప్రశ్నించారు. ఏదో ఆర్నెల్లు ముందంటే ఒప్పుకోవచ్చుగానీ మరీ ఏడాది ముందు ఎన్నికలంటే ఎవరు ఒప్పుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎప్పటికీ సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికల బాధ్యతలు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నాట్లు చెప్పారు. గడిచిన మూడేళ్లలో రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు.రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ గెలుపు ఖాయమని లోకేష్ స్పష్టం చేశారు. గెలవలేమేమో అన్న భయం తమకు ఎప్పుడూ లేదన్నారు. టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని, ఈసారీ వారు టీడీపీకే పట్టం కడతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
తండ్రీ,కొడుకు లిద్ద‌రూ చేసిన వేర్వేరు ప్ర‌క‌ట‌న‌లు చూస్తే ఇద్ద‌రి మ‌ద్య స‌మ‌న్వ‌యం లోపించిన‌ట్లు క‌నిపిస్తోంది.చంద్రబాబు వ్యాఖ్యలకు విరుద్దంగా లోకేష్ చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి.పార్టీ శ్రేణ‌లు కూడా అయేమ‌యంలో ప‌డ‌టంలో సందేహంలేదు.బాబు మాట నమ్మాలో…లోకేష్ మాట న‌మ్మాలో అర్థంకాక పార్టీ నాయ‌కులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}

Also Read

  1. నంద్యాల ఉప ఎన్నిక టికెట్‌..ఉత్కంఠ‌కు తెర‌ప‌డేదెప్పుడు….?
  2. లోకేష్ వచ్చాక టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉందో తెలుస్తే షాక్ అవుతారు
  3. భూమా చిన్న కూతురు మౌనికకు నంద్యాల వైసీపీ టికెట్
  4. సొంత జిల్లాలో బాబు స‌మావేశానికి డుమ్మాకోట్టిన బొజ్జల,ఎంపీ శివప్రసాద్‌ 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -