- Advertisement -

ఈ – వ్యాలెట్ సంస్థ‌ల‌కు ఆర్‌బీఐ బ్రేక్‌

- Advertisement -
e violet about rbi

దేశంలో పెరిగిపోతున్న న‌ల్ల‌ధనానికి…. అవినీతికి చెక్ పెట్టేంద‌కు  నోట్ల‌ను ర‌ద్దుచేసి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది కేంద్రం. ఇక‌నుంచి లావేదేవీల‌న్నీ ఆన్‌లైన్ లోకి తీసుకురావ‌డం ద్వారా న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్టడంతోపాటు దేశాన్ని డిజిట‌ల్ వైపు మ‌ల్లించాల‌న్న ఉద్దేశ్యంతో  ఈ-లావాదేవీల‌ను ప్రోత్స‌హిస్తోంది. నోట్ల ర‌ద్దుత‌ర్వాత మొబైల్ వ్యాలెట్ల వాడ‌కం దేశ వ్యాప్తంగా ఊపందుకొంది.

దీనిలో భాగంగానే ఈ-వ్యాలెట్ సంస్థ‌లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చాయి. అయితే ఆర్‌బీఐ ఈ సంస్థ‌ల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించింది. ప్రీ-పెయిడ్ పేవ్‌మెంట్ ఇన్ స్ట్రూమెంట్ లైసెన్స్ హోల్డ‌ర్ల‌కు నిర్ధిష్ట‌మైన మార్గ ద‌ర్శ‌కాల‌ను వెల్ల‌డించింది. వీటిలో కేవైసీ  (నో యువ‌ర్ క‌స్ట‌మ‌ర్ )స‌హా ప‌లు నిబంధ‌న‌లు  రూపొందించింది. ఈ నిబంధ‌న‌లు  పేటీఎం,ప్రీచార్జ్ లాంటి మొబైల్ వ్యాలెట్ సంస్థ‌ల‌కు ఆందోళ‌న క‌లిగిస్తోంది.ఇప్ప‌టి వ‌ర‌కు వీటిద్వారా క‌ష్ట‌మ‌ర్లు రూ.20వేల వ‌ర‌కు సాధార‌ణ వివ‌రాల‌తోనే లావాదేవీలు జ‌రిపేస్తున్నారు. రూ.20వేల‌కు లావాదేవీలు మించితేనే పూర్తి కేవైసీ అప్లికేష‌న్‌ను స‌మ‌ర్పించాల్సిఉండేది.ఇప్పుడు అలా కుద‌ర‌దు.

కొత్త‌గా ఆర్‌బీఐ  మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం  ఇప్పుడు ఎవ‌రైనా పీపీఐల‌లో ఎలాంటి లావాదేవీలు జ‌రపాల‌న్నా కేవైసీ అప్లికేష‌న్ త‌ప్ప‌ని స‌రిగా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది… కొత్త‌గా లైసెన్స్ తీసుకొనే పీపీఐలు కూడా 60 రోజుల్లో కేవైసీనీ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. వ్యాలెట్ సంస్థ‌లు జూన్ 30లోగా క‌ష్ట‌మ‌ర్లకు సంబంధించిన  పూర్తివివ‌రాల‌తో కూడిన కేవైసీనీ  ఆర్బీఐకీ స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. … ఒక వేల అలా చేయ‌క‌పోతే క‌ష్ట‌మ‌ర్ల‌కు సంబంధించిన లావాదేవీల‌ను  నిలిపివేస్తామ‌ని  ఆర్‌బీఐ  తేల్చి చెప్పింది.

 

Related

  1. బర్త్ డే రోజు వస్తుంటే వణికిపోతున్న బాబు.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు
  2. సినిమా కోసం అది అమ్ముకున్న హీరోయిన్.. పరిస్థితి దారుణం
  3. బర్త్ డే రోజు వస్తుంటే వణికిపోతున్న బాబు.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు
  4. సినిమా కోసం అది అమ్ముకున్న హీరోయిన్.. పరిస్థితి దారుణం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -