Friday, April 26, 2024
- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో రాత్రి పూట కర్ఫ్యూ

- Advertisement -

దేశంలో కరానా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆందోళనకర స్థాయిలో పాజిటివిటీ రేటు పెరుగుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రి పూట కర్ప్యూ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఐదు రోజుల వ్యవధిలో ఏపీలో కోవిడ్ కేసులు 4000 లకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ అధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. బాధితులందరికీ మెరుగైనవైద్యం అందించాని జగన్ సూచించారు. నియోజకవర్గానికి ఒక కోవిడ్ సెంటర్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు. సినిమా థియేటర్లు, మాల్స్ లలో 50 శాతం ఆక్యుపెన్సీ ఉండేలా చూసుకోవాలిని ఆదేశించారు. బహిరంగ సభలు, సమావేశాలకు అనుమనతిని నిరాకరించారు. ఇన్డోర్ కార్యమాలకు 100 మందికి మించి అనుమతి ఉండదు. త్వరలోనే వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేయనుంది.

రాష్ట్రంలో కరోనా ఆంక్షలు పొడిగింపు

నల్లగొండలో నరబలి

ధర్మాన ధర్మ సంకటం

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -