ప్రభుత్వ భోజనం నిరాకరించిన రైతులు..!

- Advertisement -

రైతు సంఘాలతో కేంద్రం చర్చలు కొనసాగుతున్నాయి. భోజన విరామంలో రైతులు తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్నే తిన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన భోజనం తినేందుకు నిరాకరించారు.వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో.. రైతు సంఘాల నేతలతో రెండోసారి సమావేశమైంది కేంద్రం. చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. సాగు చట్టాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.

మరోవైపు .. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాల్సిందేనంటూ రైతులు ఆందోళనలు ఉద్ధృతం చేస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా పార్లమెంటును సమావేశపర్చాలని డిమాండ్​ చేశారు. మంగళవారం చర్చల సందర్భంగా.. కేంద్రం ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. ఈ నేపథ్యంలో.. ఇవాళ్టి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.వ్యవసాయ చట్టాలపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

- Advertisement -

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News

- Advertisement -
Loading...