Saturday, April 20, 2024
- Advertisement -

తగ్గిన బంగారం.. షాక్ ఇస్తున్న వెండి!

- Advertisement -

గత ఏడాది బంగారం ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో మనుషుల ప్రాణాలే కాదు.. ఆర్థిక నష్టాలు కూడా భారీగానే జరిగాయి. అయితే బంగారం ధరలు మాత్రం అనూహ్యంగా పెరిగిపోతూ వచ్చాయి. తాజగా కేంద్ర ప్రభుత్వం లో బడ్జెట్ లో బంగారం పై కస్టమ్స్ డ్యూటీ తగ్గించింది. 

దాంతో పసిడి పై ఎఫెక్ట్ పడటంతో తగ్గుముఖం పట్టింది.10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.400 పడిపోయింది. దీంతో 1ధర రూ.44,750కు తగ్గింది. మరోవైపు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గింది. దీంతో రేటు రూ.48,820కు దిగొచ్చింది. 

ఇదే సమయంలో వెండి మాత్రం షాక్ ఇస్తుంది. కేజీ వెండి ధర రూ.2,200 పైకి కదిలింది. దీంతో రేటు రూ.73,200కు పెరిగిపోయింది. యితే బంగారు నగలు కొనుగోళ్లు భారీగా పెరిగితే మాత్రం మళ్ళీ బంగారం ధర పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -