Thursday, May 9, 2024
- Advertisement -

తెలంగాణలో లాక్​డౌన్​ ఎత్తివేత?

- Advertisement -

తెలంగాణలో లాక్​డౌన్​ ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం సడలింపులతో లాక్​డౌన్​ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు లాక్​డౌన్​ సడలింపులు కొనసాగుతున్నాయి. సాయంత్రం మరో గంటపాటు అంటే ఆరు గంటల వరకు ఇళ్లకు చేరుకొనేందుకు వెసులుబాటు కల్పించారు.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతున్నది. ప్రతిరోజు 1000 నుంచి 1500 కేసులు మాత్రమే వస్తున్నాయని వైద్య ఆరోగ్యశాఖ అంటున్నది. ఈ క్రమంలో లాక్​డౌన్​ పూర్తిస్థాయిలో ఎత్తేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా థర్డ్​వేవ్​ పై భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలు హెచ్చరికలు జారీచేశాయి. అయితే తెలంగాణలో మాత్రం లాక్​డౌన్​ ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

Also Read: థర్డ్​వేవ్​.. చిన్నపిల్లల తల్లిదండ్రులూ బీకేర్​ఫుల్​..!

ఈ నెల 20 వరకు లాక్​డౌన్​ అమల్లో ఉంది. అయితే ఈ లోపే క్యాబినెట్​ సమావేశమై లాక్​డౌన్​ ఎత్తివేసే విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో రికవరీ రేటు 96.13 శాతం, మరణాల రేటు 0.57 శాతం ఉన్నట్టు వైద్య అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో లాక్​డౌన్​పై తుది నిర్ణయం తీసుకొనేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

సీఎం కేసీఆర్​ లాక్​డౌన్​ ఎత్తివేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. లాక్​డౌన్​ విధించడంతో రాష్ట్రంలో వ్యాపారాలు దెబ్బతిన్నాయి. చిరు వ్యాపారులు రోడ్డున పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం ఆదాయం రావడం లేదు. దీంతో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని లాక్​డౌన్​ ఎత్తివేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.

Also Read : ఏపీలో క‌ర్ఫ్యూ పొడిగింపు.. మరిన్ని సడలింపులు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -