Friday, May 10, 2024
- Advertisement -

జగన్ కు తెలుగుదేశం అంతగా భయపడుతోందా…!

- Advertisement -

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ మోహన్ రెడ్డి దీక్షకు అనుమతిని ఇచ్చేది లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. జగన్ దీక్షకు అనుమతించమని స్పష్టం చేశాడు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని జగన్ డిమాండ్ చేస్తూ నిరవిధిక నిరాహార దీక్షకు దిగుతానంటే అనుమతిని ఇవ్వమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి సుజనాచౌదరి కూడా ఈ విషయంలో జోక్యం చేసుకున్నాడు. జగన్ దీక్షకు అనుమతిని ఇచ్చేది లేదని స్ఫష్టం చేశాడు. అదేంటి అంటే.. ప్రతిపక్షం చెప్పింది వినడానికా మేము ఉండేది? అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నాడు.

మరి ప్రజాస్వామ్య దేశంలో దీక్ష లు చేసుకోవడానికి ఎవ్వరికైనా అవకాశం ఉంది. నిరసన తెలపడానికి.. నిరాహార దీక్షలకు కూర్చోవడానికి అవకాశఃఉంది.  అయితే భద్రతా కారణాల రీత్యా జగన్ ప్రభుత్వ అనుమతిని కోరి ఉండవచ్చు. అయితే ఈ దీక్షకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతిని ఇచ్చేది లేదని బాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. మరి ఇలా చెప్పడం ఏమిటి? జగన్ దీక్షకు ఎందుకు అనుమతించడం లేదు? అంటే… ఇదంతా కేవలం జగన్ దీక్ష అంటే ప్రభుత్వానికి ఉన్న భయం వల్లనే అనుకోవాల్సి వస్తోంది.

జగన్ కు తెలుగుదేశం ప్రభుత్వం భయపడుతోందని అనుకోవాల్సి వస్తోంది. అది కూడా ప్రత్యేకహోదా అంశం గురించి కాబట్టి… ఈ అంశంపై జగన్ దీక్ష చేపడితే ప్రజల నుంచి మద్దతు రావొచ్చు. ప్రత్యేకహోదా అంశం పై ప్రజల్లో గట్టి చర్చ జరగవచ్చు… ఆ విషయంలో ప్రజలకు అవగాహన పెరిగి.. జగన్ కు ఆదరణ పెరగవచ్చు… ప్రభుత్వంపై వ్యతిరేకత కలగవచ్చనే భయంతో చంద్రబాబు ప్రభుత్వం ఈ దీక్షకు అనుమతినివ్వడం లేదని అనుకోవాల్సి వస్తోంది. అయితే జగన్ మాత్రం తగ్గేది లేదు.. దీక్ష చేసేదే.. అని అంటున్నాడు. మరేం జరుగుతోందో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -