Saturday, May 11, 2024
- Advertisement -

ప్ర‌మాదంనుంచి తృటిలో త‌ప్పించుకున్న మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్‌

- Advertisement -
Helicopter with Maharashtra CM Devendra Fadnavis crash-lands in Latur

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్ర‌మాదంనుంచి తృటిలో త‌ప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ లాతూర్‌ వద్ద క్రాష్‌ అయింది. ఈ ఘటనలో ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. తాను సేఫ్‌గా ఉన్నానని, కంగారు పడాల్సిన పని లేదని ఫడ్నవీస్‌ ట్వీట్‌ చేశారు.

ల్యాండింగ్‌కు అనుకూలంగా లేనప్పటికీ.. పైలట్ హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. దీంతో హెలికాప్టర్ మట్టిలో కూరుకుపోయింది. హెలికాప్టర్ రెక్కలు కూడా విరిగిపోవడం గమనార్హం. అయితే ఈ ఘటనలో సీఎం ఫడ్నవీస్ సహా మిగతా సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు.క్రాష్ ల్యాండింగ్ అయిన ప్రాంతానికి కేవలం ఐదారు మీటర్ల దూరంలోనే నివాస గృహాలు ఉన్నాయి. ఓ ట్రాన్స్ ఫార్మర్, విద్యుత్ వైర్లు ఉన్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

గురువారం ఉదయం టేకాఫ్ అయిన ఫడ్నవీస్ హెలికాప్టర్, సాంకేతిక లోపంతో ఎటు వెళ్లిందన్న సమాచారం కూడా తెలియరాలేదు. లాతూర్ సమీపంలో క్రాష్ ల్యాండ్ అయిన హెలికాప్టర్.. ఒక గోడను ఢీకొట్టినట్లుగా సమాచారం. ఈ ఘటనలో హెలికాప్టర్ వెనుక భాగం తీవ్రంగా దెబ్బతింది. ఇదే హెలికాప్టర్ లో 10రోజుల క్రితం కూడా సాంకేతిక లోపం ఏర్పడినట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే, హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్ చివరి క్షణంలోనే ఇదంతా జరగడం, ఆపై అది కేవలం ఒకటి, రెండు మీటర్ల ఎత్తునుంచే కింద నిట్టనిలువుగా పడటంతోనే అందులోని వారు ప్రాణాలతో బయటపడ్డారు.ఏదిఏమైనా పెను ప్రమాదం నుంచి ఫడ్నవీస్ క్షేమంగా బయటపడటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

{loadmodule mod_custom,Side Ad 2}

కాగా, సీఎం హెలికాప్టర్‌ క్రాష్‌పై సీఎంవో ఓ ప్రకటన విడుదల చేసింది. హెలికాప్టర్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే ప్రమాదం సంభవించినట్లు పేర్కొంది. పది రోజుల క్రితమే హెలికాప్టర్‌లో సమస్య తలెత్తినట్లు సమాచారం. అయినా హెలికాప్టర్‌ను ఎందుకు వినియోగించరానేది ప్రశ్నార్ధకంగా మారింది.

{loadmodule mod_sp_social,Follow Us}

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -