Saturday, April 20, 2024
- Advertisement -

మరింత ఉదృతంగా సాగుతున్న చలో ఢిల్లీ..!

- Advertisement -

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ అన్నదాతలు చేపట్టిన ‘చలో ఢిల్లీ’ ఆందోళన ఐదో రోజుకు చేరింది. ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా వేలాది మంది రైతులు ఢిల్లీ శివారుల్లోని సంఘి, టిక్రీ రహదారుల్లోనే బైఠాయించారు. దీనితో ఈ సరిహద్దుల్లో వాహనాల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యస్థానాలకు వెళ్లాలని సూచిస్తున్నారు.

ఢిల్లీ సరిహద్దుల్లో ఉండకుండా శివారులోని బురాడిలో ఉన్న మైదానానికి వెళ్లి ఆందోళన కొనసాగిస్తే చర్చలు జరుపుతామన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనను అభ్యర్థులు తిరస్కరించిన విషయం తెలిసిందే. షరతులుంటే తాము చర్చలకు రాబోమని రైతులు స్పష్టం చేశారు. సరిహద్దుల నుంచే ఆందోళన కొనసాగిస్తామన్నారు. అవసరమైతే ఢిల్లీని దిగ్బంధిస్తామని హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -