Friday, April 26, 2024
- Advertisement -

కరోనా.. నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవ్: హైదరాబాద్ పోలీసులు

- Advertisement -

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతూనే ఉన్నాయి. ఇక తెలంగాణలో గత కొన్ని రోజులుగా కొత్తగా నమోదవుతున్న కేసుల్లో గణనీయమైన పెరుగుద ఉంది. రాష్ట్ర రాజ‌ధాని హైదరాబాద్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి క‌ల‌వ‌రం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ జాగ్ర‌త్తలు తీసుకోక‌పోతే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హైద‌రాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

తాజాగా హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసు క‌మిష‌న‌ర్ అంజ‌నీ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. క‌రోనా వైర‌స్ కేసులు క్ర‌మంగా పెరుగుతుంటే.. ప‌లువురు ప్ర‌జ‌లు కోవిడ్‌-19 నిబంధ‌న‌లు పాటించ‌కుండా ఉల్లంఘిస్తున్నార‌నీ, అలాంటి వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చరించారు. దాదాపు కోటికి మంది జ‌నాభా ఉన్న జీహెచ్ఎంసీ ప‌రిధిలో క‌రోనా బారిన‌ప‌డుతున్న వారు పెరుగుతున్నార‌ని అన్నారు.

అయితే, పాజిటివ్ కేసులు పెరుగుతున్న ప‌లువురు లెక్క‌చేయ‌కుండా నిర్ల‌క్ష్యం వ‌హిస్తున్నార‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో క‌రోనా మ‌హమ్మారి సెకండ్ వేవ్ మొద‌లైంద‌నీ, కోవిడ్‌-19 ప‌ట్ల జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం అత్యంత ప్ర‌ధాన‌మైన విష‌య‌మ‌ని అంజనీ కుమార్ స్ప‌ష్టం చేశారు. భౌతిక దూరం పాటించ‌డం, మాస్కులు ధ‌రించడం, సానిటైజ‌ర్లు వాడ‌టం, స్వీయ ర‌క్ష‌ణ‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచించారు. కాగా, రాష్ట్రంలో తాజాగా దాదాపు మూడు వేల‌కు చేరువ‌గా కొత్త కేసులు న‌మోద‌య్యాయి.

ఎముక‌ల బలంకోసం వీటిని తినా‌ల్సిందే!

ఉత్కంఠభరితంగా ఐపీఎల్ తొలి మ్యాచ్… బెంగళూరు గెలుపు

క్రేజీ కాంభో.. చరణ్ మూవీలో సల్మాన్ !

జమ్మూకశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదుల హతం

వ్యాక్సినేషన్ ముమ్మరం చేయండి: సీఎం జగన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -