Tuesday, May 7, 2024
- Advertisement -

టీడీపీ, బీజేపీలతో జగన్ మైండ్ గేమ్!

- Advertisement -

తమపై జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడైనా కాస్త గట్టి ఆరోపణలు చేసి.. నైతికంగా ఇబ్బంది పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక్కటే మాటను అందుకొంటుంది. ‘జగన్ అవినీతి పరుడు..

దోచుకొన్నాడు.. త్వరలోనే జైలుకు వెళతాడు!’ అనేది తెలుగుదేశం వారు చెప్పేమాట. మరి ఇది నైతికంగా వైకాపాకు ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే.. ఇప్పటికే ఒకసారి జగన్ మోహన్ రెడ్డి జైలుకు వెళ్లాడు. ఆస్తుల వ్యవహారంలో సీబీఐ విచారణను ఎదుర్కొంటూ  16 నెలల పాటు జైల్లో ఉన్నాడు. జగన్ ఎందుకు జైలుకెళ్లాడు.. అనే సంగతి పక్కనపెడితే, ఆ అరెస్టు కేంద్ర ప్రభుత్వం నిర్ణయానుసారం జరిగిందనేది బహిరంగ రహస్యమే. జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయనపై కేసులు నమోదు కావడం.. సీబీఐ అనేది పూర్తిగా అధికార పార్టీ కనుసన్నల్లో పనిచేసే వ్యవస్థ కావడంతో.. జగన్ అరెస్టు వెనుక కాంగ్రెస్ అధినేత్రి హస్తం ఉందనే అభిప్రాయాలు కలిగాయి. మరి అప్పుడూ జగన్ వ్యతిరేక కూటమే కేంద్రంల అధికారంలో ఉంది.. ఇప్పుడూ జగన్ వ్యతిరేక కూటమే కేంద్రంలో అధికారం చెలాయిస్తోంది. ఈ నేపథ్యంలో ఆస్తుల వ్యవహారంలో జగన్ మళ్లీ జైలుకు వెళ్లగలడని తెలుగుదేశం పార్టీ వ్యాఖ్యానించడం.. సామాన్య జనాల మధ్య అలాంటి ప్రచారం చేయడం వైకాపాకు ఇబ్బందిగా మారింది! తమకు కోపం వస్తే.. మోడీకి చెప్పి జగన్ ను అరెస్టు చేయిస్తామన్నట్టుగా మాట్లాడుతున్నారు తెలుగుదేశం నేతలు.

ఈ నేపథ్యంలో ఈ ప్రచారాన్ని ఎదుర్కోవడం క్షేత్రస్థాయిలోని వైకాపా నేతలకు కష్టం అవుతోంది. అందుకే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా  వ్యవహరిస్తున్నాడు. తరచూ ఢిల్లీ పర్యటనలు  పెట్టుకొన్నాడు. భారతీయ జనతా పార్టీ ముఖ్య నేతలను కలుస్తున్నాడు. మరి ఇలా కలిసి జగన్ వారితో కేసుల వ్యవహారం గురించి చర్చిస్తాడని అనుకోలేం.. అయితే తనకు భారతీయ జనతా పార్టీ నేతలు టచ్ లోనే ఉన్నారు… తను భారతీయ జనతా పార్టీ దగ్గరగానే ఉన్నాను.. అనే సంకేతాలను ఇవ్వాలనేది జగన్ ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ నేతలు గనుక జగన్ పై ఆగ్రహంతో ఉంటే.. ఆయనతో సాంగత్యం వల్ల తమకూ చెడ్డపేరు వస్తుందనుకొంటే జగన్ కు అస్సలు అపాయింట్ మెంటే ఇచ్చే వారు కాదు. అయితే వారు జగన్ అడిగినప్పుడల్లా అపాయింట్ మెంట్ ఇస్తున్నారు.. జగన్ వ్యూహానికి సహకరిస్తున్నారు. దీని వల్ల క్షేత్రస్థాయిలోని వైకాపా శ్రేణులకు కొంత ఊరట లభిస్తోంది. తమ అధినేత కేంద్రంతో టచ్ లో ఉన్నాడు.. సీబీఐ, ఈడీలను నిరోధించే కేంద్ర ప్రభుత్వంతో తమ అధినేతకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయి.. దీంతో ఆయన అరెస్టు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్లు ప్రచారం చేస్తున్నంత సులభమైన వ్యవహారం కాదు.. అని వైకాపా వాళ్లు ధైర్యం తెచ్చుకొంటున్నారు. కార్యకర్తల్లో ఇలాంటి ధైర్యాన్ని నింపడానికే జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనల వ్యూహాన్ని అమలు పెడుతున్నట్టుగా ఉన్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -