Wednesday, May 22, 2024
- Advertisement -

సైన్యాన్ని రంగంలోకి దించండి – కెసిఆర్

- Advertisement -

త‌క్ష‌ణ‌మే పోలీసుల్నీ, సైన్యాన్ని రంగంలోకి దించండ‌ని ఢిల్లీ నుంచి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారుల‌ను ఆదేశించారు. ఎవ‌రికీ ఎలాంటి ఆప‌ద త‌లెత్త‌కుండా త‌గిన విధంగా చ‌ర్య‌లు తీసుకోండ‌ని ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా జ‌లాల‌ వివాదాన్ని తేల్చుకోవ‌డానికి ఢిల్లీ వెళ్లిన సీఏం ఈ రోజు ఉద‌య‌మే ఇలాంటి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని ఆశ్చ‌ర్య పోతున్నారా? ఇదంతా హైద‌రాబాద్ వాసులు కోస‌మే లేండి.

కావేరీ జ‌ల‌వివాదం ర‌చ్చ‌కెక్కి ప‌బ్లిక్ ఆస్తులు ధ్వంశ‌మైన వేళ కృష్ణా నీటి స‌మ‌స్య‌పై ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు భేటీ అవుతున్న వేళ వ‌చ్చిన ఆస‌క్తిక‌ర కామెంట్ ఇది. గ‌త రెండు రోజులుగా కురుస్తోన్న వ‌ర్షాల‌కు హైద‌రాబాద్ లో లోత‌ట్లు ప్రాంతాలు జ‌ల‌మయ‌మ‌య్యాయి. ప్ర‌జ‌ల‌కు ఇక్క‌ట్లు త‌ప్ప‌డం లేదు. ప్ర‌జ‌ల అవ‌స‌రాల మేర‌కు ఆహార ప‌దార్థ‌ల‌ను పంపిణీ చేయాల‌ని సూచించారు.

పోలీసులు రంగంలోకి దిగి బాధితుల‌ను కాపాడాల‌ని ఆదేశించారు. మ‌ళ్లీ భారీగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంది. మ‌రో నాలుగైదు గంట‌ల పాటు ప్ర‌జ‌లంతా ఇళ్ల‌లోనే ఉండాల‌ని జీహెచ్ ఎంసీ అధికారులు ఇప్ప‌టికే హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. దీంతో అవ‌స‌ర‌మైతే సైనిక స‌హాయం తీసుకోమ‌ని అధికారుల‌ను సూచించారు. అయితే ఢిల్లీ నుంచి కేసీఆర్ ఫోన్ చేయ‌గానే అక్క‌డ ఏమైనా ఏపీ సీఎంతో గ‌ల‌టా జరిగిందా అని అంతా కంగారు ప‌డ్డారు. పోలీసులు, సైన్యం అన‌గానే అంతా షాక‌య్యారు. ఇది ఆ నీటి స‌మ‌స్య కాదు.. ఈ నీటి స‌మ‌స్య అని త‌మాయించుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -